Kannappa: ‘కన్నప్ప’తో ఆ డ్రీమ్ కూడా తీర్చేసుకుంటున్నారు..

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:05 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా టీమ్ ఇటీవలే న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు మేకర్లు. ఈ చిత్రంలో మంచు ఫ్యామిలీ మూడో తరానికి చెందిన అవ్రామ్ మంచును పరిచయం చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Kannappa: ‘కన్నప్ప’తో ఆ డ్రీమ్ కూడా తీర్చేసుకుంటున్నారు..
Avram Manchu with Vishnu Manchu

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా టీమ్ ఇటీవలే న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా ‘కన్నప్ప’ నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు మేకర్లు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నట్లుగా సినిమాపై హైప్ పెంచిన మేకర్స్.. ఇదే సినిమాతో మరో డ్రీమ్‌ కూడా తీర్చేసుకుంటున్నట్లుగా అధికారికంగా ఓ వార్తను రివీల్ చేశారు. అదేంటంటే.. మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు.

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) వారసుడిగా విష్ణు మంచు రాగా.. విష్ణు మంచు వారసత్వంగా అవ్రామ్ మంచు (Avram Manchu) కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నారు. విష్ణు మంచు తన ఐదేళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని అద్భుతమైన దృశ్యకావ్యమైన ‘కన్నప్ప’తో మొదలుపెట్టారు. మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబుతో మొదలుకొని ఈ చిత్రంలో మూడు తరాలకు చెందిన మంచు కుటుంబ సభ్యులు నటిస్తుండటం విశేషం. మాములుగా ‘కన్నప్ప’ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఇప్పటి వరకు చెప్పబడుతోంది. ఇప్పుడు కొడుకు ఎంట్రీ కూడా యాడ్ అవ్వడంతో.. ఆ డ్రీమ్ కూడా విష్ణుకి తీరినట్లయింది. (Avram Manchu Debut with Kannappa)


Manchu-Vishnu.jpg

న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాల నడుమ 90 రోజులు పాటు నిర్విరామంగా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అవ్రామ్ పాత్రకు ‘కన్నప్ప’లో ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తుండటంపై విష్ణు మంచు స్పందించారు. ‘‘ఈ ‘కన్నప్ప’ సినిమాకు నా జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నా కొడుకు అవ్రామ్ కీలక పాత్రలో నటించడం చాలా గర్వకారణం. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మా కుటుంబం యొక్క మూడు తరాల కలయికతో వస్తోన్న అరుదైన చిత్రం’’ అంటూ చెప్పుకొచ్చారు. ‘కన్నప్ప’ మొదటి షెడ్యూల్ ముగియగానే విష్ణు మంచు తనకు సహకరించిన టీంకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇప్పుడు తన కొడుకు ఎంట్రీపై స్పందిస్తూ.. ‘‘అవ్రామ్‌తో కలిసి ఈ సినిమా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. సినీ ప్రేమికులందరి ఆశీర్వాదం కోరుకుంటున్నాను. ‘కన్నప్ప’ ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది. ఇది మా కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’’ అని పేర్కొన్నారు. (Kannappa Latest Update)


ఇవి కూడా చదవండి:

====================

*Dushara Vijayan: అంత పద్దతిగా ఉండే దుషార.. ఒక్కసారిగా దుమ్మురేపిందిగా..

*************************

*Eagle: మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..

*************************

*Mangalavaaram: ఓటీటీలో సంచలనం.. నెక్లస్ రోడ్‌లో అరాచకం.. ఎందుకు?

**************************

*Vijayakanth: ముఖ్యమంత్రి కావాల్సిన నేత విజయకాంత్‌.. ఈ మాట ఎవరన్నారంటే?

*************************

Updated Date - Jan 05 , 2024 | 03:05 PM