Mangalavaaram: ఓటీటీలో సంచలనం.. నెక్లస్ రోడ్‌లో అరాచకం.. ఎందుకు?

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:00 AM

గ్లామర్ తార పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్‌లో నటించిన ‘మంగళవారం’ సినిమా గతేడాది విడుదలై సక్సెస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను చూరగొంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెక్లస్ రోడ్‌లో ఈ సినిమా స్పెషల్ వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేయించింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్.

Mangalavaaram: ఓటీటీలో సంచలనం.. నెక్లస్ రోడ్‌లో అరాచకం.. ఎందుకు?
Mangalavaaram Wall Paint Poster

గ్లామర్ తార పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) లీడ్ రోల్‌లో నటించిన “మంగళవారం” (Mangalavaaram) సినిమా గతేడాది విడుదలై సక్సెస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి ‘మంగళవారం’ సినిమాను రూపొందించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్‌పై సక్సెస్ ఫుల్‌గా రన్ అయిన “మంగళవారం” సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో గత నెల 26వ తేదీ నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లోనూ సంచలనంగా మారింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నట్లుగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది.


Payal.jpg

ఇంకా ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు సదరు ఓటీటీ సంస్థ ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా మొదలెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెక్లస్ రోడ్‌ (Necklace Road)లో ఈ సినిమా స్పెషల్ వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేయించింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar). ప్రముఖ ఆర్టిస్ట్ లక్ష్మీ నారాయణ ఈ పెయింటింగ్‌ను డిజైన్ చేశారు. “మంగళవారం” సినిమా వాల్ పెయింటింగ్ హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆహ్వానం పలుకుతోంది. అరాచకం ఏంటంటే.. ఈ పెయింటింగ్‌పై వాడిన ట్యాగ్‌లైన్.. ‘అక్రమ సంబంధాలు ఉంటే చంపేస్తారంట.. ఎందుకు?’. ఈ ట్యాగ్, అలాగే ఈ పెయింటింగ్ జనాలను బాగా ఆకర్షిస్తోంది.

Updated Date - Jan 05 , 2024 | 11:00 AM