Dushara Vijayan: అంత పద్దతిగా ఉండే దుషార.. ఒక్కసారిగా దుమ్మురేపిందిగా..

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:43 PM

‘సర్పట్టా పరంబరై’ చిత్రంలో మారియమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన యువ హీరోయిన్‌ దుషార విజయన్‌... ఆ తర్వాత ‘కళువేత్తి మూర్ఖన్‌’, ’అనీతి’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న ‘వేట్టయ్యన్‌’ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సాంప్రదాయంగా కనిపించిన దుషార.. తన తాజా ఫొటోషూట్‌లో మాత్రం అందరికీ బికినీ ట్రీట్ ఇచ్చేసింది.

Dushara Vijayan: అంత పద్దతిగా ఉండే దుషార.. ఒక్కసారిగా దుమ్మురేపిందిగా..
Dushara Vijayan

‘సర్పట్టా పరంబరై’ (Sarpatta Parambarai) చిత్రంలో మారియమ్మ పాత్రలో అద్భుతంగా నటించిన యువ హీరోయిన్‌ దుషార విజయన్‌ (Dushara Vijayan)... ఆ తర్వాత ‘కళువేత్తి మూర్ఖన్‌’, ’అనీతి’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న ‘వేట్టయ్యన్‌’ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఆమె సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, ప్రత్యేక ఫోటోషూట్‌లు నిర్వహిస్తోంది.

Dushara-2.jpg

ఇలా ఫొటోషూట్స్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసే హీరోయిన్లలో ఆమె కూడా ఇప్పుడు చేరిపోయింది. ఇప్పటివరకు ఆమె షేర్‌ చేసిన ఫోటోలు ఎంతో సంప్రదాయబద్ధంగా ఉన్నాయి. కానీ, తన తాజా ఫోటోషూట్‌లో మాత్రం దుషార దుమ్మురేపింది.


Dushara-3.jpg

తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు మాత్రం ఎంతో గ్లామర్‌గా, స్కిన్‌ షో చేస్తూ కనిపించాయి. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తమిళ హీరోయిన్లు ఎవరూ ఈ తరహా బికినీ దుస్తులు ధరించి ఫోటోలు తీసి... సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సందర్భాలు లేవు. (Dushara Vijayan Bikini Show)

Dushara-5.jpg

కానీ, దుషారా మాత్రం ఎంతో ధైర్యంగా ఈ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘2024లో మీరు రాక్ చేయండి మేడమ్’, ‘ఏంటి మేడమ్ ఒక్కసారే ఇలా షాక్ ఇచ్చారు’, ‘మీరు అస్సలు తగ్గొద్దు’ అంటూ ఈ ఫొటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో దుషార గ్లామర్ ట్రీట్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Dushara-4.jpg

Dushara-1.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Eagle: మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..

*************************

*Mangalavaaram: ఓటీటీలో సంచలనం.. నెక్లస్ రోడ్‌లో అరాచకం.. ఎందుకు?

**************************

*Vijayakanth: ముఖ్యమంత్రి కావాల్సిన నేత విజయకాంత్‌.. ఈ మాట ఎవరన్నారంటే?

*************************

*Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

******************************

*దీనస్థితిలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ సాయం

**************************

Updated Date - Jan 05 , 2024 | 12:43 PM