Salaar: ‘సలార్’ జపాన్‌లో సందడికి డేట్ ఫిక్సయింది.. ట్రైలర్ కూడా వదిలారు

ABN , Publish Date - May 04 , 2024 | 07:19 PM

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్రాలు జపాన్‌లో మంచి ఆదరణను పొందుతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’, ‘సాహో’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు జపాన్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టి.. అక్కడ కూడా తెలుగు సినిమా సత్తాని చాటాయి. ఇప్పుడు మరో సినిమా జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ చిత్ర జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది.

Salaar: ‘సలార్’ జపాన్‌లో సందడికి డేట్ ఫిక్సయింది.. ట్రైలర్ కూడా వదిలారు
Salaar Movie Poster

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చిత్రాలు జపాన్‌ (Japan)లో మంచి ఆదరణను పొందుతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ (Bahubali), ‘సాహో’ (Saaho), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలు జపాన్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టి.. అక్కడ కూడా తెలుగు సినిమా సత్తాని చాటాయి. ఇప్పుడు మరో సినిమా జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ చిత్ర జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జపాన్‌లో జూలై 5వ (Salaar Japan Release Date) తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. తాజాగా మేకర్స్ జపనీస్ భాషకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ని వదిలారు.

*Laggam: వారి ‘లగ్గం’ ఎంత వరకు వచ్చిందంటే..


ఈ ట్రైలర్‌తో మరోసారి ‘సలార్’ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ కూడా బాగుందంటూ సోషల్ మీడియా కామెంట్స్ పడుతున్నాయి. జపాన్‌లో ఈ చిత్రాన్ని మూవీ ట్విన్ వారు విడుదల చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి, శృతి హాసన్ వంటివారు కీలక పాత్రలలో నటించారు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంటోంది. (Rebel Star Prabhas Salaar Movie)


Salaar-Prabhas.jpg

‘సలార్’ మొదటి పార్ట్ ముగించిన తీరు.. రెండో పార్ట్‌‌పై మరింతగా అంచనాలను పెంచేలా చేసింది. రెండో పార్ట్ శౌర్యంగ పర్వం అంటూ ప్రశాంత్ నీల్ ఓ పెద్ద యుద్ధకాండనే సృష్టించబోతున్నారనేది ఈ ముగింపుతో స్పష్టమైంది. అందుకే పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఇక జపాన్ విషయానికి వస్తే.. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో ప్రభాస్ అక్కడ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆయనకు అక్కడ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే ‘సలార్’ కూడా అక్కడ మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

Updated Date - May 04 , 2024 | 08:03 PM