Laggam: వారి ‘లగ్గం’ ఎంత వరకు వచ్చిందంటే..

ABN , Publish Date - May 04 , 2024 | 04:33 PM

‘ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు’ అన్నారు పెద్దలు.. ‘ఇల్లు ఈఎమ్ఐలో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాం రండి’ అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో నిర్మాత వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘లగ్గం’. జనవరిలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం.. మే 3వ తేదీతో టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది.

Laggam: వారి ‘లగ్గం’ ఎంత వరకు వచ్చిందంటే..
Laggam Movie Still

‘ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు’ అన్నారు పెద్దలు.. ‘ఇల్లు ఈఎమ్ఐలో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాం రండి’ అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల (Ramesh Cheppala). సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో నిర్మాత వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘లగ్గం’ (Laggam). జనవరిలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం.. మే 3వ తేదీతో టాకీ పార్ట్ (Laggam Movie Update) మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy) మాట్లాడుతూ.. మన తెలుగు కల్చర్‌తో జరిగే పెళ్ళిళ్లలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలతో ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంది. పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే.. పరమార్థం. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం... ఈ ‘లగ్గం’ సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాము. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు.

*Prabhas: కొంతగ్యాప్‌ తర్వాత ప్రేమకథతో..


Laggam.jpg

‘లగ్గం’ చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథా చిత్రమని నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) అన్నారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు వంటి సీనియర్ల నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని.. తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్‌ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్‌గా తెలిపారు. చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారని, ‘బేబీ’ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. సాయి రోనక్, ప్రగ్యా నర్రా ఇందులో యంగ్ కపుల్‌గా నటిస్తున్నారు. (Laggam Talkie Part Completed)

Read Latest Cinema News

Updated Date - May 04 , 2024 | 04:33 PM