Salaar Trailer : ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త!

ABN , First Publish Date - 2023-11-09T17:10:02+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌' కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 28న విడుదల కావల్సిన ఈ చిత్రం పలు కారణాల చేత వాయిదా పడింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు.

Salaar  Trailer : ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త!

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌' కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 28న విడుదల కావల్సిన ఈ చిత్రం పలు కారణాల చేత వాయిదా పడింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ట్రైలర్‌ని డిసెంబర్‌ ఒకటో తేదిన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ క్రిటిక్‌, ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

"సలార్‌’ ట్రైలర్‌ విడుదల విషయంలో ఎలాంటి వాయిదా లేదు. అలాగే సినిమా డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ కోసం అందరూ సిద్ధంకండి’’ అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తరణ్‌ ట్వీట్‌తో ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులు సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ప్రశాంత నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయిక. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం సలార్‌ సీజ్‌ఫైర్‌ను ఈ ఏడాది కిస్మస్‌ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-11-09T17:10:03+05:30 IST