Salaar : ప్రభాస్‌ గన్ ఫైర్‌.. ఆ డేట్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2023-11-12T12:14:18+05:30 IST

. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు

Salaar : ప్రభాస్‌ గన్  ఫైర్‌.. ఆ డేట్‌ వచ్చేసింది!

పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్  నీల్‌ (prashanth neel) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'సలార్‌: సీజ్‌ ఫైర్‌’ (salaar) . యాక్షన్  థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. డిసెంబర్‌ 1వ తేదీ రాత్రి 7.19 గంటలకు 'సలార్‌’ చిత్రం ట్రైలర్‌ విడుదల  చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.


ఇందులో ఓ వాహనంపై నిల్చొచి గన్‌ ఫైర్‌ చేస్తూ కనిపించారు ప్రభాస్‌. ప్రస్తుతం ఈ పోస్టర్‌  నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ పోస్టర్‌ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. శ్రుతీహాసన కథానాయికగా ప్రశాంత్  నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  డిసెంబర్‌ 22న విడుదల కానున్న ఈ చిత్రం ఐమాక్స్‌ వెర్షనలో కూడా రిలీజ్‌ కానుంది. 

Updated Date - 2023-11-12T12:14:19+05:30 IST