Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్.. ట్విస్ట్ ఏమిటంటే?

ABN , Publish Date - Mar 12 , 2024 | 06:46 PM

మంచు మనోజ్ భార్య మౌనికా రెడ్డి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే తన అన్న మంచు విష్ణుకు కవలలు పుట్టినట్లే.. మంచు మనోజ్‌కు కూడా కవలలు పుట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై.. తాజాగా మంచు మనోజ్ స్పందించారు. ఆ వార్తలను నమ్మవద్దు అంటూ ఓ లేఖను ఆయన విడుదల చేశారు.

Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్.. ట్విస్ట్ ఏమిటంటే?
Manchu Manoj Family

మంచు మనోజ్ (Manchu Manoj) భార్య మౌనికా రెడ్డి (Mounika Reddy) ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే తన అన్న మంచు విష్ణుకు కవలలు (Twins) పుట్టినట్లే.. మంచు మనోజ్‌కు కూడా కవలలు పుట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై.. తాజాగా మంచు మనోజ్ స్పందించారు. ఆ వార్తలో నిజంగా లేదంటూ కండీస్తూనే.. మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని తెలిపి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన లేఖలో ఏముందంటే..

అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం..

అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.

శుభవార్త: నా సతీమణి ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి. భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురుచూస్తున్నాం.

ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను: కవల పిల్లలు విషయంలో బయట వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేము నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము. దయచేసి మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు.

ఎల్లప్పుడూ.. మీరు మాపై చూపించే ఆదరాభిమానాలే మాకు శ్రీరామరక్ష..

కృతజ్ఞతలతో

-మంచు మనోజ్


Manchu-Manoj.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Trisha: చిరు ఇచ్చిన గిఫ్ట్‌తో మురిసిపోతోన్న త్రిష.. ఇంతకీ చిరు ఏమిచ్చారంటే..

**************************

*Akash Puri: నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్నతో..!

**********************

*Swag: శ్రీవిష్ణు సరసన నటించే క్వీన్ రుక్మిణి దేవి ఎవరంటే..

****************************

Updated Date - Mar 12 , 2024 | 07:12 PM