Swag: శ్రీవిష్ణు సరసన నటించే క్వీన్ రుక్మిణి దేవి ఎవరంటే..

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:46 PM

శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీతో చేస్తున్న కొత్త సినిమాకి ‘శ్వాగ్’ అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టైటిల్, కాన్సెప్ట్ వీడియో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర హీరోయిన్‌ని మేకర్స్ పరిచయం చేశారు.

Swag: శ్రీవిష్ణు సరసన నటించే క్వీన్ రుక్మిణి దేవి ఎవరంటే..
Ritu Varma in Swag

శ్రీవిష్ణు (Sree Vishnu) పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు హసిత్ గోలీ (Hasith Goli)తో చేస్తున్న కొత్త సినిమాకి ‘శ్వాగ్’ (Swag) అనే టైటిల్ హిలేరియస్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టైటిల్, కాన్సెప్ట్ వీడియో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు, హసిత్ గోలి రీయూనియన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)పై టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర హీరోయిన్‌ని మేకర్స్ పరిచయం చేశారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రీతూ వర్మ (Ritu Varma) పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 10). ఈ సందర్భంగా ‘శ్వాగ్’ మేకర్స్ ఆమె పాత్రను వింజమర వంశంలోని మహారాణి రుక్మిణి దేవి (Rukmini Devi)గా పరిచయం చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో రీతూ వర్మ.. శ్రీవిష్ణు వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ కనిపించారు. మగవారి కంటే స్త్రీలు గొప్పవారు, శక్తివంతులు అని చెప్పారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీవిష్ణు, ‘శ్వాగ్’ అనేది మగవారి కథ, శ్వాగనికి వంశం కథ అని స్పష్టం చేశారు. (Ritu Varma Look in Swag)


swag-Ritu-varma.jpg

ఈ వీడియో హిలేరియస్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శ్వాగ్’ చిత్రం.. శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ మూవీగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. (#Rituvarma)


ఇవి కూడా చదవండి:

====================

*Patang: పాత‌బ‌స్తీలో ‘పతంగ్’ పాట వదిలారు..

**********************

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

Updated Date - Mar 10 , 2024 | 06:46 PM