Akash Puri: నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్నతో..!

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:21 PM

నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్‌లో మూవీ చేస్తానని అన్నారు యంగ్ హీరో ఆకాష్ పూరి. ఆయన తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్‌కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంచ్ కార్యక్రమంలో ఆకాష్ పూరి పాల్గొన్నారు.

Akash Puri: నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్నతో..!
Akash Puri

నాన్న పూరి జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్‌లో మూవీ చేస్తానని అన్నారు యంగ్ హీరో ఆకాష్ పూరి (Akash Puri). ఆయన తొలిసారి ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్‌కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ బ్రాండింగ్ లాంచ్ కార్యక్రమంలో ఆకాష్ పూరి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని రమేష్, రోమన్ నన్ను సంప్రదించారు. నేను ఈ బ్రాండింగ్‌కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్‌లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ముందుకొచ్చాను. నేను చేస్తున్న ఫస్ట్ బ్రాండింగ్ ఇదే కావడం హ్యాపీగా ఉంది. ఇదే కాకుండా మరికొన్ని బ్రాండింగ్స్‌కు కూడా అంబాసిడర్‌గా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.


Akash.jpg

ఇక నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా ‘చోర్ బజార్’ (Chor Bazaar) అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ప్రాజెక్ట్ లాక్ అయిన తర్వాత పూర్తి వివరాలు చెబుతాను. నేను ఈసారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను. నేను ఇప్పటికీ చిన్న పిల్లాడిలా ఉంటాను అనే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ వంటి క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇప్పట్లో నటించకూడదు అని అనుకున్నా. నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్‌లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. ‘కార్తికేయ 2 (Karthikeya 2), హనుమాన్ (Hanuman)’ వంటి మూవీస్ చూసినప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించాలనే కోరిక కలుగుతుంటుంది. నాన్న పూరి డైరెక్షన్‌లో రామ్ గారు నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ చాలా బాగా వస్తోంది. ఈ మధ్యే టీజర్ రఫ్ కట్ చూశాను. రామ్ (Ram) గారి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది. ప్రభాస్ (Prabhas) గారిని కలిసినప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్‌ (Single)గానే ఉన్నాను. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Swag: శ్రీవిష్ణు సరసన నటించే క్వీన్ రుక్మిణి దేవి ఎవరంటే..

****************************

*Patang: పాత‌బ‌స్తీలో ‘పతంగ్’ పాట వదిలారు..

**********************

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

Updated Date - Mar 10 , 2024 | 09:21 PM