Mahesh-Namrata: ఈరోజు తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం.. మహేష్, నమ్రతల ఇన్‌స్టా పోస్ట్స్ వైరల్

ABN , Publish Date - May 26 , 2024 | 07:01 PM

మా హృదయం గర్వంతో పొంగిపొరలుతోందని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు చేసిన పోస్ట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతగా వారు ప్రౌడ్‌గా ఫీల్ అవడానికి కారణం ఏమిటని అనుకుంటున్నారా? వారి కుమారుడు గౌతమ్ కృష్ణే అందుకు కారణం. గౌతమ్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం మహేష్ బాబు, నమత్ర ఇన్‌స్టాలో తమ సంతోషాన్ని తెలియజేశారు.

Mahesh-Namrata: ఈరోజు తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం.. మహేష్, నమ్రతల ఇన్‌స్టా పోస్ట్స్ వైరల్
Mahesh Babu, Namrata and Gautam

మా హృదయం గర్వంతో పొంగిపొరలుతోందని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), ఆయన భార్య నమ్రత శిరోద్కర్. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు చేసిన పోస్ట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతగా వారు ప్రౌడ్‌గా ఫీల్ అవడానికి కారణం ఏమిటని అనుకుంటున్నారా? వారి కుమారుడు గౌతమ్ కృష్ణే (Gautam Krishna) అందుకు కారణం. గౌతమ్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం మహేష్ బాబు, నమత్ర ఇన్‌స్టాలో (Mahesh Babu Insta Post) తమ సంతోషాన్ని తెలియజేశారు. ఈ పోస్ట్‌‌లో గౌతమ్‌పై వారు తమ ప్రేమను వెల్లడించారు.

Mahesh-1.jpg

‘‘నా హృదయం గర్వంతో పొంగిపొరలుతోంది. గౌతమ్.. నీ గ్రాడ్యుయేషన్‌ (Gautam Graduation)కు అభినందనలు. నీ కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయం నీవే రాయాల్సి ఉంది. ఇకపై నీవు మరింతగా ప్రకాశిస్తావని నాకు తెలుసు. నీ కలలను చేధించుకుంటూ ముందుకు వెళ్లు. ఒక్కటి గుర్తు పెట్టుకో.. నీపై ఎప్పుడూ మా ప్రేమ ఉంటుంది. ఈ రోజు తండ్రిగా నిన్ను చూసి ఎంతగానో గర్వపడుతున్నాను..’’ అని మహేష్ బాబు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో పాటు తన కుమారుడితో ఉన్న పిక్‌ని కూడా మహేష్ అటాచ్ చేశారు. (Mahesh Babu Proud Moment)


మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్‌కి ‘మాటల్లేవ్.. కేవలం ప్రేమ మాత్రమే’ అంటూ నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కామెంట్ చేయడంతో పాటు ఆమె కూడా తన ఇన్‌‌స్టా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. ‘‘ఈ సందర్భంలో నేను ఎంత గర్వపడుతున్నానో అది నీకు తెలియాలని కోరుకుంటున్నాను. నీపై నీవు నిజాయితీగా ఉండి, నీ ప్యాషన్‌ను ఫాలో అవుతూ.. కలలను సాకారం చేసుకుంటావని భావిస్తున్నాను. నిన్ను నేను ఎంతగా నమ్ముతున్నానో అంతకంటే ఎక్కువగా నిన్ను నువ్వు నమ్ము. ఒక్కటి మాత్రం చెబుతున్నాను.. నీ లైఫ్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా.. నా ప్రేమ, మద్దతు ఎప్పుడూ ఉంటాయని మాత్రం తెలుసుకో. నీదైన ఈ రోజుకు అభినందనలు. ఇక నుంచి ఈ ప్రపంచం నీది. లవ్ యూ సో మచ్’’ అని నమ్రత తన పోస్ట్‌లో పేర్కొంది.


Gautam-1.jpg

ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు (Mahesh Babu Fans) కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. గౌతమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరైతే.. తన కుమారుడి కంటే కూడా మహేష్ యంగ్‌గా ఉన్నాడనేలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తండ్రికొడుకుల ఫొటోతో పాటు.. మహేష్, నమ్రతల ఈ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.


Gautam-3.jpg

Gautam-2.jpg

Updated Date - May 26 , 2024 | 07:07 PM