Mahesh Babu Birthday: త్రివిక్రమ్ కన్నా పూరి జగన్ బెస్ట్ అంటున్నారు అభిమానులు

ABN , First Publish Date - 2023-08-09T19:26:34+05:30 IST

మహేష్ బాబు రాబోయే సినిమా 'గుంటూరు కారం' లుక్ కన్నా, అతని పాత సినిమా 'బిజినెస్ మేన్' గురించే మహేష్ బాబు అభిమానులు అతని పుట్టినరోజు నాడు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, అలాగే వైరల్ కూడా అయింది.

Mahesh Babu Birthday: త్రివిక్రమ్ కన్నా పూరి జగన్ బెస్ట్ అంటున్నారు అభిమానులు
Mahesh Babu still from Businessman film

మహేష్ బాబు (MaheshBabu) పుట్టినరోజు అయిన ఈరోజు అంటే ఆగస్టు 9 అతని అభిమానులకి పండగే. అయితే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజుకి అభిమానులు ఒక పెద్ద కానుకే ఇచ్చారు అని చెప్పవచ్చు. ఎందుకంటే అగ్ర నటుల పాత సినిమాలు మళ్ళీ రి రిలీజ్ చెయ్యడం మొదలు పెట్టింది మహేష్ బాబు. అతని 'ఒక్కడు' #Okkadu సినిమా తో మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రతి నటుడు, అలాగే ప్రతి హిట్ సినిమాలని విడుదల చేస్తున్నారు. 'ఒక్కడు' మళ్ళీ రెండో సారి విడుదలైనప్పుడు పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

businessman-mahesh1.jpg

అయితే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్పట్లో పెద్ద హిట్ అయిన అతని ముందు సినిమా 'బిజినెస్ మేన్' #Businessman4K విడుదలైంది. దీనికి పూరి జగన్నాథ్ (PuriJagannadh) దర్శకుడు. ఇందులో మహేష్ అప్పటి వరకు చేసిన సినిమాలకన్నా ఒక వైవిధ్యమైన పాత్ర ఇందులో చేసాడు. అలాగే ఇందులో మహేష్ ఒక పాటలో పాడతాడు కూడా. థమన్ (SThaman) దీనికి సంగీత దర్శకుడు. ఈ సినిమా విడుదలై 11 సంవత్సరాలు అవుతోంది, కానీ ఇప్పుడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ అభిమానుల కోసం విడుదలైంది.

ఈ సినిమా అప్పుడు విడుదలైనప్పుడు ఒక సంచలనం సృష్టించింది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో మాటలు, పాటలు, పోరాట సన్నివేశాలు, అన్నిటికీ మించి 'సూర్యా భాయ్' ఇవన్నీ మహేష్ అభిమానులని అలరించాయి. ఈ సినిమా ఈరోజు మహేష్ పుట్టినరోజు నాడు విడుదలై అంతే సంచలనం సృష్టిస్తోంది అని చెపుతున్నారు. సాంఘీక మాధ్యమాల్లో మహేష్ అభిమానులు ఈ సినిమా గురించే ఎక్కువ మళ్లాడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దర్శకత్వంలో రాబోతున్న 'గుంటూరు కారం' #GunturKaram గురించి ఎక్కువ మాట్లాడుకోవటం లేదు కానీ, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ 'బిజినెస్ మేన్' #Bussinessman4K గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు.

businessman-mahesh2.jpg

ఈరోజు విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. అలాగే ప్రీ బుకింగ్ లోనే రికార్డు నెలకొల్పిన ఈ 'బిజినెస్ మేన్' సినిమా రెండో సారి విడుదలైనప్పుడు కూడా సంచలనమే ! ఇందులో కాజల్ అగర్వాల్ (KajalAgarwal) కథానాయిక, కాగా ఈ సినిమాలో మొదటిసారిగా మహేష్ లిప్ లాక్ సన్నివేశంలో నటించాడు అని అంటారు.

మొత్తం మీద రాబోయే 'గుంటూరు కారం' కన్నా ఇంతకు ముందు పూరి జగన్ దర్శకత్వంలో వచ్చిన 'బిజినెస్ మేన్' మహేష్ పుట్టినరోజు సందడి చేసింది బాగా.

Updated Date - 2023-08-09T23:30:21+05:30 IST