మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dil Raju: ఎలాంటి లీకులు ఇవ్వలేను.. నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:57 PM

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో.. ‘గేమ్ చేంజర్’ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో ఆయన ఈ ‘గేమ్ చేంజర్’ గురించి మాట్లాడారు. ఇకపై తన నుండి ఎలాంటి లీకులు ఉండవని తెలిపారు.

Producer Dil Raju

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) పుట్టినరోజును హైదరాబాద్‌లో ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీలు హాజరై, రామ్ చరణ్ (Ram Charan) గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా నిర్మిస్తోన్న నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా హాజరయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం కావడంతో.. ‘గేమ్ చేంజర్’ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని దిల్ రాజు ఈ కార్యక్రమంలో వెల్లడించారు.

ఇంకా మెగా ఫ్యాన్స్‌ (Mega Fans)ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ ఓపికకు పరీక్ష పెడుతున్నాం. ఇంకొంత కాలం ఓపిక పట్టాల్సిందే. ఒక తుపాను వచ్చే ముందు ప్రశాంతమైన వాతావరణం ఎలా ఉంటుందో.. అలా కాస్త సైలెంట్‌గా ఉండక తప్పదు. ఎందుకంటే, రామ్‌ చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ (Mega Power Star) కాదు.. గ్లోబల్‌ స్టార్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి.. ఆ స్థాయిని మించేలా ‘గేమ్ చేంజర్’ని శంకర్ తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్ అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత ఐదు నెలల్లో సినిమాను రిలీజ్‌‌కు తీసుకొస్తాం. చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌గా ‘జరగండి జరగండి’ పాటని విడుదల చేశాం. ఈ సాంగ్‌లో చూసింది చాలా తక్కువ. అంతా దాచిపెట్టాం. థియేటర్లలో ఈ పాట చూసి ప్రేక్షకులు తప్పకుండా డ్యాన్స్‌ చేస్తారు. ఇంకొన్ని నెలలు కాస్త నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ‘దిల్‌ మామా.. మాకొక అప్‌డేట్‌ ఇవ్వు’ అంటూ మీరు పెట్టే కామెంట్స్ అన్ని చూస్తూనే ఉన్నా. ఇకపై ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ అయినా.. శంకర్ (Director Shankar) ఇవ్వమంటే ఇస్తా తప్పితే ఎలాంటి లీకులు ఇవ్వలేను’’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.


RRR వంటి సెన్సేషనల్ బ్లాక్‌స్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

***************************

*Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

************************

*Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..

*****************************

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

Updated Date - Mar 28 , 2024 | 01:57 PM