Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:16 AM

నేను, అనుపమ కలిసున్న పోస్టర్ విడుదల చేసినప్పుడు.. కొందరు నెగటివ్ కామెంట్స్ రాశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం కాస్త దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..
Siddhu Jonnalagadda

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Star Boy Siddhu Jonnalagadda) హీరోగా నటిస్తూ.. కథనం, సంభాషణలు అందించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square).. మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘డీజే టిల్లు’ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది టైటిల్ సాంగ్. ఈ పాట కోసం రామ్ మిరియాలని ఆఫీస్‌కి పిలిపించాము. పారితోషికం గురించి మాట్లాడుతుంటే.. అప్పుడు ఆయన డబ్బులు గురించి తర్వాత చూద్దాం.. ముందు పాట బాగా రావాలి అన్నారు. సినీ పరిశ్రమలో ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. రామ్ మిరియాలను కలిసిన ప్రతిసారీ ఒక మాట అంటాను. అదేంటంటే.. నువ్వు పాడినప్పుడు నీ గొంతులో మట్టివాసన ఉంటుంది. అంత రియల్‌గా, అంతా రా గా ఉంటుంది. డీజే టిల్లు పాటని అంత అద్భుతంగా స్వరపరిచిన రామ్ మిరియాలకి, అంతే అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్‌కి ధన్యవాదాలు. సినిమాని ఆ పాటే భుజాల మీద తీసుకెళ్లి సగం మోసింది. నాకు ఇలాంటి పాట అందించిన మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. అలాగే ఈ సినిమాలో భాగమైన శ్రీరామ్ చంద్ర వాయిస్ చాలా బాగుంటుంది. ‘బేబీ’ సినిమాలో ఆయన వాయిస్ విని పిచ్చొడిని అయిపోయాను. మనసు విరిగిన కుర్రాళ్ళ మనస్సులో ఉన్న బాధ అంతా ఆయన గొంతులోనే ఉంటుంది. శ్రీరామ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. (Tillu Square Pre Release Event)


Siddhu.jpg

మా మార్కస్, లడ్డు గురించి చెప్పాలి. ఈ జర్నీలో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా బాగుంటాయి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నా తల్లిదండ్రుల పాత్రలు పోషించిన మురళీధర్, సుజాత, మిగతా నటీనటులకు థాంక్స్. డీజే టిల్లు అనేది యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. కానీ సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులకు, అందునా ముఖ్యంగా ఆడవాళ్లకు, చిన్న పిల్లలకు టిల్లు పాత్ర బాగా నచ్చడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. టిల్లు పాత్రని ప్రేక్షకులు హృదయాల్లో పెట్టుకున్నారు. నన్ను సిద్ధు కంటే కూడా ఎక్కువగా టిల్లు అనే పిలుస్తున్నారు. బయట ఎక్కడైనా కనిపిస్తే టిల్లు అన్న అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. అందుకే సీక్వెల్ అంటే మొదట కాస్త భయపడ్డాను. కానీ ఒక్కటే అనుకున్నాను. మొదటి పార్ట్‌లా ఉండకూడదు, కానీ అదే స్థాయిలో వినోదాన్ని పంచాలి. అలాగే టిల్లు పాత్రలో ఉన్న సోల్ మిస్ అవ్వకూడదు. హీరోయిన్ పాత్ర కూడా మొదటి పార్ట్ లాగే బాగా ఫేమస్ అవ్వాలి. ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాము. అయినా మొదట కాస్త భయపడ్డాము. (Tillu Square Ready to Release)

Tillu.jpg

యుద్ధం గెలుస్తామో లేదో మన చేతుల్లో ఉండదు.. కానీ పోరాటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది నమ్మే మా టీం అంతా టిల్లు స్క్వేర్ కోసం శాయశక్తులా కృషి చేశాం. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మాకు సంతృప్తి కలిగింది. మొదటి పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. మార్చి 29న థియేటర్లకు రండి, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అలాగే ఈ సినిమా విషయంలో నేను కొందరికి థాంక్స్ చెప్పాలి. ముందుగా ‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. నేను, కళ్యాణ్, ఆంథోనీ, మల్లిక్ కలిసి ఈ సినిమా రాశాము. కళ్యాణ్ మాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగే ఎడిటర్ నవీన్ నూలికి, డీటీఎస్ ఇంజనీర్ రాధాకృష్ణకి థాంక్స్ చెప్పుకోవాలి. అందరికంటే ముఖ్యంగా మా నిర్మాత నాగవంశీకి ప్రత్యేక కృతఙ్ఞతలు. మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాకు అండగా నిలిచిన చినబాబుగారికి, త్రివిక్రమ్‌గారికి చాలా చాలా థాంక్స్. సినిమా కొన్నిసార్లు మాకు అర్థమైన దానికంటే.. త్రివిక్రమ్ గారికి ఎక్కువ అర్థమై మాకు ఎంతో సాయం చేశారు. భీమ్స్ సిసిరోలియో గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టిల్లులో మాస్‌ని తన సంగీతంతో ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు. మార్చి 29న థియేటర్లలో చాలా చాలా నవ్వబోతున్నారు. చాలా థ్రిల్స్, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. మాస్ క్లైమాక్స్‌ని చూడబోతున్నారు. టిల్లు స్క్వేర్ మీ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తాజాగా నేను, అనుపమ కలిసున్న పోస్టర్ విడుదల చేసినప్పుడు.. కొందరు నెగటివ్ కామెంట్స్ రాశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం కాస్త దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. (Siddhu Jonnalagadda Speech at Tillu Square Pre Release Event)


ఇవి కూడా చదవండి:

====================

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

*****************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

Updated Date - Mar 28 , 2024 | 10:16 AM