Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:08 PM

హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో బైక్ యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి సినిమా నిమిత్తం అమెరికాలో ఉన్న నవీన్ పోలిశెట్టి.. అక్కడ బైక్‌పై వెళుతుండగా.. బైక్ స్కిడ్ అవడంతో పడిపోయాడని, చేతికి బలమైన దెబ్బ తగిలినట్లుగా సమాచారం. ఆయనకు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది.

Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్..
Hero Naveen Polishetty

హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికా (USA)లో బైక్ యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి సినిమా నిమిత్తం అమెరికాలో ఉన్న నవీన్ పోలిశెట్టి.. అక్కడ బైక్‌పై వెళుతుండగా.. బైక్ స్కిడ్ అవడంతో పడిపోయాడని, చేతికి బలమైన దెబ్బ తగిలినట్లుగా సమాచారం. ఆయనను రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా.. ఇంత వరకు బయటికి రాలేదు. నవీన్ పోలిశెట్టి (Hero Naveen Polishetty) తన టీమ్‌కి ఈ విషయం తెలియజేయడంతో.. అతనికి యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు బయటికి వచ్చాయి. ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి నవీన్ పోలిశెట్టి మాత్రం ఎక్కడా స్పందించలేదు. (Naveen Polishetty Injured in Bike Accident)


Naveen.jpg

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mister Polishetty) సినిమాలతో నవీన్ పోలిశెట్టి హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ.. తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండటం నవీన్ స్పెషాలిటీ. అందుకే ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమాల విషయానికి వస్తే.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి రెండు సినిమాలకు సైన్ చేశారు. ఒకటి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో కాగా, రెండోది షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌లో ఉండనుంది. ప్రస్తుతం సితార బ్యానర్‌లో చేయాల్సిన సినిమాకు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డైరెక్టర్‌ని ఫైనలైజ్ చేసే పనిలో టీమ్ ఉంది. (Bike Accident to Hero Naveen Polishetty)


ఇవి కూడా చదవండి:

====================

*Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

************************

*Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..

*****************************

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

*****************************

Updated Date - Mar 28 , 2024 | 12:08 PM