Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:04 AM

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు.. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా.. ప్రచారానికి వెళ్తానని అన్నారు గ్లామర్ క్వీన్ అనసూయ. ప్రస్తుతం అనసూయ వెండితెరపై నటిగా దూసుకెళుతోంది. ప్రస్తుతం అనసూయ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి అనసూయ.. మైక్ పట్టి ప్రచారానికి దిగితే.. అదే చేస్తానంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Anasuya: నాకు పార్టీ కాదు.. లీడర్ ముఖ్యం.. పవన్ కళ్యాణ్‌ పిలిస్తే ప్రచారం చేస్తా!
Anasuya and Pawan Kalyan

జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) గొప్ప నాయకుడు.. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా.. ప్రచారానికి వెళ్తానని అన్నారు గ్లామర్ క్వీన్ అనసూయ (Anasuya). ప్రస్తుతం అనసూయ వెండితెరపై నటిగా దూసుకెళుతోంది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘రంగమార్తాండ’ రీసెంట్‌గా వచ్చిన ‘రజాకార్’ వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడటమే కాకుండా.. ఆయా పాత్రలు ఆమెను బిజీ నటిగా మార్చేశాయి. ఆమె ఎన్ని సినిమాలలో, ఎలాంటి పాత్రలు చేసినా.. అనసూయ అనగానే అంతా గ్లామర్ తారగానే చూస్తారు. అందుకే సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలు బీభత్సమైన ఆదరణను పొందుతుంటాయి. ఈ విషయంలో ఆమెకున్న క్రేజే వేరు. అలాంటి అనసూయ.. మైక్ పట్టి ప్రచారానికి దిగితే.. అదే చేస్తానంటోంది అనసూయ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎన్నికల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Anasuya Ready to Campaign for Pawan Kalyan)

ఈ ఇంటర్వ్యూలో ఆమెకు.. నాగబాబు (Nagababu), రోజా (Roja).. ఇద్దరు మీకు క్లోజ్ కదా.. ఈ ఎన్నికలలో ప్రచారం చేయమని వారు కోరితే ప్రచారం చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ‘ఇప్పుడు నేను చెప్పే సమాధానం వివాదం కావచ్చు.. కానీ అడిగారు కాబట్టి చెబుతున్నా.. నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు.. కానీ నాకు పొలిటికల్ పార్టీస్ ముఖ్యం కాదు. నాకు లీడర్సే ముఖ్యం. మంచి లీడర్స్ ఏ పార్టీలో ఉన్నా సరే.. ప్రచారం చేయడానికి వెనుకాడను. ‘జబర్దస్త్‌’ (Jabardasth)లో నాగబాబుగారు, రోజాగారు ఇద్దరితో పనిచేశాను. రోజాగారి కంటే కూడా కాస్త నాగబాబుగారి దగ్గరే చనువు ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)గారు గ్రేట్ లీడర్. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్తాను. (Anasuya About Janasena Chief Pawan Kalyan)


Anasuya-Politics.jpg

ఒకవేళ అటు నుంచి రోజా గారూ.. ఇటు నుంచి నాగబాబు గారూ పార్టీలోకి పిలిస్తే.. ముందే చెప్పాను కదా.. నాకు నాయకులతోనే పని.. పార్టీలతో కాదు. నాకు చాలా పార్టీల నుంచి చాలామంది లీడర్లు తెలుసు.. వాళ్లని అభిమానిస్తాను. వాళ్లు ఇద్దరూ పిలిస్తే.. తప్పకుండా ప్రచారానికి వెళ్తాను. అయితే అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది. వాస్తవానికి అది నా జాబ్ కాదు.. ఆ టైమ్‌కి నా అజెండాని బట్టి నేను సపోర్ట్ చేస్తాను. నాకసలు రాజకీయాలంటే ఇష్టం లేదు. మా నాన్న అప్పట్లో రాజకీయాల్లో (Politics) ఉండేవారు. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కూడా కారణం నేనే. కానీ నేను ఈ సొసైటీలో ఉంటున్నాను కాబట్టి.. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మంచి లీడర్‌ని ఎన్నుకోమని.. నేను వేరే వాళ్లకి చెప్పడం.. వాళ్లు నా మాట వినడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. నేను చెబితే కొంతమంది అయినా వింటారనే నమ్మకం ఉన్నప్పుడు.. కచ్చితంగా కరెక్ట్‌గా చెప్పాలి. నేను చెప్తే వింటారు కదా అని.. ఏది పడితే అది చెప్పడం తప్పు. పవన్ కళ్యాణ్‌గారు మంచి లీడర్ (Good Leader) కాబట్టి.. ఆయన పిలిస్తే మాత్రం తప్పకుండా ప్రచారానికి వెళ్తాను’’ అని చెప్పుకొచ్చారు అనసూయ. (Anasuya Comments on AP Politics)


ఇవి కూడా చదవండి:

====================

*Siddhu Jonnalagadda: అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..

*****************************

*Siddharth and Aditi Rao Hydari: రహస్యంగా వివాహం.. ఎక్కడంటే?

*****************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

Updated Date - Mar 28 , 2024 | 11:15 AM