మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Family Star: సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు

ABN, Publish Date - Apr 07 , 2024 | 05:53 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Family Star Movie

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయని.. ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారనేలా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దృష్టికి వచ్చింది. నిర్మాణ సంస్ధ ఇచ్చిన సోషల్ మీడియా స్క్రీన్ షాట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ (Cybercrime) పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు.

*The Family Star Movie Review: విజయ్ దేవరకొండకి 'ది ఫ్యామిలీ స్టార్' బ్రేక్ ఇచ్చిందా...


ఇంటెన్షనల్‌గా కొందరు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాపై చేస్తున్న దుష్ప్రచారం వల్ల సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. వీరి దగ్గర నుంచి కంప్లైంట్, ప్రాథమిక ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.


‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో కొందరు విజయ్ మీద ద్వేషంతో ఇలా ఆయన సినిమాల మీద నెగిటివ్‌గా సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు సైతం మూవీ బాగుందని.. కావాలని కొందరు సినిమాపై యూట్యూబ్‌లో, సోషల్ మీడియా‌లో నెగటివ్‌గా ప్రచారం చేయిస్తున్నారనీ చెప్పడం గమనార్హం. (Family Star Vijay Deverakonda)


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 07 , 2024 | 05:56 PM