Ram Charan: రామ్ చరణ్‌కు పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్..

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:37 AM

ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు.. టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

Ram Charan: రామ్ చరణ్‌కు పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్..
Global Star Ram Charan Birthday Wishes Poster

ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌ (Ram Charan)కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు జనసేన (Janasena) అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan). జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో.. (Happy Birthday Global Star Ram Charan)

‘‘ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని... సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి... మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ ఈ లేఖలో పేర్కొన్నారు.


Janasena.jpg

మరోవైపు రామ్ చరణ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) (నాటు నాటు పాట మ్యూజిక్‌తో ఓ స్పెషల్ వీడియో), దర్శకుడు ప్రశాంత్ నీల్, శర్వానంద్.. ఇలా పలువురు హీరోలు, దర్శకులు.. టాలీవుడ్ నిర్మాణ సంస్థలు గ్లోబల్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలియజేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్‌డే ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

********************

*Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..

************************

*Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..

********************************

Updated Date - Mar 27 , 2024 | 11:37 AM