Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..

ABN , Publish Date - Mar 27 , 2024 | 10:03 AM

తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానంలో మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకార అనే నామకరణం చేసింది. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్‌ని మాత్రం మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు రివీల్ కానివ్వవని విషయం తెలిసిందే.

Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్ రివీలైందోచ్..
Mega Princess Klin Kaara

తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానంలో మెగా ప్రిన్సెస్ (Mega Princess) క్లీంకార ఫేస్ రివీలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకార (Klin Kaara) అనే నామకరణం చేసింది. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్‌ని మాత్రం మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకు రివీల్ కానివ్వలేదు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. పాప ఎక్కడ బయట కనిపించినా.. ఫేస్ కనిపించకుండా కవర్ చేస్తూ వచ్చారు. కానీ రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా క్లీంకార ఫేస్ రివీలైంది. (Mega Princess Klin Kaara)


Ram-Charan.jpg

నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (#HBDGlobalStarRamCharan). ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు, కూతురు క్లీంకారతో కలిసి వెళ్లి తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గుడిలోకి చెర్రీ దంపతులు వెళుతుండగా.. క్లీంకార ఫేస్ కాస్త రివీల్ అయ్యింది. క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందంటే.. గుండ్రటి మొహం.. పెద్ద పెద్ద కళ్లతో అందానికి ఐకాన్‌లా ఉందా చిన్నారి. తల్లి ఉపాసన పొదిమి పట్టుకుంటే.. క్యూట్‌గా చూస్తున్న క్లీంకార ఫేస్ చూపరులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం క్లీంకార పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..

************************

*Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..

********************************

Updated Date - Mar 27 , 2024 | 01:44 PM