Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:30 PM

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. మార్చి 29న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా విశేషాలను హీరో విశ్వ కార్తికేయ మంగళవారం మీడియాకు తెలియజేశారు.

Vishva Karthikeya: ఈ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం..
Vishva Karthikeya about Kaliyugam Pattanamlo

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Aayushi Patel) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి (Ramakanth Reddy). డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. మార్చి 29న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా విశేషాలను హీరో విశ్వ కార్తికేయ మంగళవారం మీడియాకు తెలియజేశారు. ఆ విశేషాలివే..

‘కలియుగం పట్టణంలో’ టైటిల్ ఎందుకు పెట్టారు?

ప్రతీ మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటిని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. నంద్యాలలో ఈ సినిమా కథ జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని పెట్టాం.

‘కలియుగం పట్టణంలో’ మీకు ఏం నచ్చింది..?

ఎలాంటి పాత్రనైనా చేయగలను అనే పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను. ఇందులో ప్రతీ పాత్ర చక్కగా ఉంటుంది. అన్ని క్యారెక్టర్లకు రెండు షేడ్స్ ఉంటాయి. రెండు షేడ్స్ ఉంటాయా? డబుల్ రోలా? అన్నది చెప్పలేం. నాకు మాత్రం ఈ కథ చాలా బాగా నచ్చింది. అందుకే ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని చేశాను.

ఈ సినిమా కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. కోపంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి.. ఎక్కువగా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి.. ఇలా ప్రతీ ఒక్క ఎమోషన్ కోసం వర్క్ షాప్‌ చేశాం. (Hero Vishva Karthikeya Interview)

ఇది వరకు మీరు చేసిన సినిమాలకు, ఈ మూవీకి ఉన్న తేడా ఏంటి?

నేను ఇంతకు ముందు చేసిన ‘కళాపోషకులు’ పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. ‘అల్లంత దూరాన' మెలో డ్రామాగా ఉంటుంది. ‘జై సేన’ అనేది పూర్తి కమర్షియల్‌గా ఉంటుంది. అయితే ఈ చిత్రం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్, సస్పెన్స్ మాత్రమే కాకుండా మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ప్రతీ రెండు మూడు సీన్లకు కొత్త జానర్ అనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నా కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

అసలీ సినిమాలోని కాన్సెప్ట్ ఏంటి?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపించాం. పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందో ఇందులో తెలియజేశాం. క్రైమ్స్‌లోనూ డిఫరెంట్ సీన్లు కనిపిస్తాయి.

సినిమా షూటింగ్ అంతా కడపలోనే జరిగింది కదా.. అక్కడి అనుభవాలేంటి?

కడపలో చాలా మంచి లొకేషన్లున్నాయి. అంతా లైవ్ లొకేషన్లలోనే షూట్ చేశాం. సెట్ వర్క్ చేయలేదు. మా సినిమాను అన్నపూర్ణ బ్యానర్ వారు రిలీజ్ చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. మంచి అవుట్ పుట్ వచ్చింది. మా సినిమాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. (Vishva Karthikeya About Kaliyugam Pattanamlo)


Vishva-Kaliyugam.jpg

‘కలియుగం పట్టణంలో’ కథ ఎలా ఉండబోతోంది? ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నారు?

తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం. ఎలా పెంచితే పిల్లలు ఎలా తయారవుతారో చూపించాం. చెడుని చెడుతోనే ఈ చిత్రంలో చూపిస్తాం. తల్లిదండ్రులు పెంచే తీరుతోనే పిల్లలు ఎదుగుతారు. పెంపకం వల్లే పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు. ప్రతీ మనిషిలో సైకిక్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లే అది తగ్గుతుంది.

హీరోయిన్ ఆయూషి గురించి.. ప్రధాన పాత్రను పోషించిన చిత్రా శుక్లా గురించి చెప్పండి?

ఆయూషి పటేల్ (Aayushi Patel) తెలుగు అమ్మాయి కావడం సినిమాకు కలిసి వచ్చింది. ప్రతీ పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. తన క్యారెక్టరైజేషన్‌లోనూ మల్టీపుల్ షేడ్స్ ఉంటాయి. తెలుగు అమ్మాయి అయితే పాత్రలోని భావాన్ని సులభంగా అర్థం చేసుకుంటుందని ఆమెను తీసుకున్నాం. నా పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఆయూషి పాత్రకీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. చిత్రా శుక్లా (Chitra Shukla) ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.

దర్శకుడు రమాకాంత్ రెడ్డితో పని చేయడం ఎలా అనిపించింది?

కథ వినడానికి అంత ఇంట్రెస్ట్‌గా వెళ్లలేదు. కానీ మా దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ, వివరించిన విధానం, ఆ స్క్రీన్‌ప్లే చూసి ఆశ్చర్యపోయాను. క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో నేను కనిపెట్టలేకపోయాను. ముందే స్టోరీ బోర్డ్ కూడా వేసుకున్నారు. మా డైరెక్టర్ ఎంతో క్లియర్ విజన్‌తో ఉన్నారు. ఆయన ఏం చెప్పారో అదే చేశాను.

టెక్నికల్‌గా ఈ సినిమా ఎలా ఉండబోతోంది?

టెక్నికల్‌గా ఎంతో బాగుంటుంది. కెమెరా వర్క్‌కు అందరూ ఆశ్చర్యపోతారు. పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా వచ్చాయి. అజయ్ మాకు మంచి సంగీతాన్ని ఇచ్చారు.

మీకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తోందా?

ఇండస్ట్రీ నుంచి నాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. హీరోలు, దర్శకులు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే వారు ఫిజికల్‌గా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుండేది.

మీకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చెప్పే వాళ్లు ఇష్టమా? నెగెటివ్ ఫీడ్ బ్యాక్ చెప్పేవాళ్లు ఇష్టమా?

పాజిటివ్ చెప్పే వాళ్లకంటే.. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్లంటేనే నాకు ఇష్టం. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ నుంచే మనం నేర్చుకోగలం.

Vishva.jpg

‘కలియుగం పట్టణంలో’ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత?

కథ విన్నప్పుడు ఇది చిన్న బడ్జెట్‌తో తీస్తారని అనుకున్నాం. కానీ ఇది చాలా భారీ బడ్జెట్ మూవీ. నా మీద పెట్టాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా పెట్టారు. మా నిర్మాతలు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. ఎక్కడా మాకు ఇబ్బంది లేకుండా షూటింగ్‌ను నిర్వహించారు. (Kaliyugam Pattanamlo Movie)

సెన్సార్ నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా?

‘ఆ నలుగురు’ చాలా మంచి చిత్రం. అదే ఇప్పుడు తీస్తే.. నువ్వెవడ్రా చెప్పడానికి అని అంటారు. అందుకే మేం చెడు గురించి చెడుగానే చెప్పాలనుకున్నాం. సెన్సార్ నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.

తదుపరి ప్రాజెక్ట్ ఏంటి?

విశ్వ ఓ సినిమా తీసినా, చేసినా ఓ మంచి సందేశం ఉంటుందని అనుకోవాలి. నా సినిమా చూసి చెడుదారిన పట్టకూడదని అనుకుంటాను. ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. ఆ మూవీలోనూ ఆయూషి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. మంత్ర, తంత్రాలు, చేతబడుల నేపథ్యంలో ఆ సినిమా ఉండబోతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..

********************************

*Manamey: శర్వానంద్ సినిమా ‘మనమే’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..

***********************

*Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..

******************************

Updated Date - Mar 26 , 2024 | 10:30 PM