Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..

ABN , Publish Date - Mar 26 , 2024 | 10:18 PM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) మూవీ.. ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేస్తోంది. మూవీ విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Prithviraj Sukumaran: ‘సలార్’కు పూర్తి భిన్నమైన పాత్ర చేశా..
Prithviraj Sukumaran

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించిన ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) (ఆడు జీవితం) మూవీ.. ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ (Director Blessy) రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ (Mythri Movie Distribution) సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్‌లో రిలీజ్ చేస్తోంది. మూవీ విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. (Prithviraj Sukumaran About The Goat Life)

‘‘వాస్తవ కథతో ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమాను తెరకెక్కించారు దర్శకుడు బ్లెస్సీ (Blessy). 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ (Najib) అనే వ్యక్తి జీవిత కథ ఈ సినిమాకు ఆధారం. రచయిత బెన్యామిన్ నజీబ్ (Writer Benjamin Najib) జీవితానికి అక్షర రూపమిచ్చారు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ గోట్ డేస్ అనే పుస్తకాన్ని బెన్యామిన్ రాశారు. కేరళలో అనూహ్య పాఠక ఆదరణ పొందిన ఈ పుస్తకం రైట్స్ కోసం మలయాళం సినీ పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో, దర్శక నిర్మాతలు పోటీ పడ్డారు. ఆ హక్కులను మా డైరెక్టర్ బ్లెస్సీ దక్కించుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌తో 2008లో బ్లెస్సీ నన్ను సంప్రదించారు. అలా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం)తో నా జర్నీ మొదలైంది.

2018లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ముందుగా రాజస్థాన్ ఎడారిలో షూటింగ్ చేయాలని అనుకున్నా.. అక్కడ అరబ్ దేశాల ఎడారుల వాతావరణం కనిపించలేదు. దాంతో జోర్డాన్ వెళ్లి చిత్రీకరణ జరిపాం. నేను బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. షూటింగ్ ప్రాసెస్‌లో ఉండగానే లాక్‌డౌన్ వచ్చింది. అప్పుడు జోర్డాన్ షూటింగ్‌లో ఉన్నాం. ప్రయాణాలు మొత్తం ఆపేశారు. అక్కడి నుంచి బయటపడే వీలు లేదు. వందేభారత్ ఫ్లైట్‌తో కేరళ చేరుకున్నాం. ఏడాదిన్నర తర్వాత అల్జీరియా సహారా ఎడారిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించాం. ఇలా ఎన్నో కష్టాలు పడి, అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ రాజీ లేకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో వర్క్ చేశాం. వాస్తవంగా రెండేళ్లలో పూర్తి చేయాల్సిన సినిమా ఇది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. (Prithviraj Sukumaran Interview)

Prithviraj-Sukumaran-2.jpg

ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే షూటింగ్ కోసం కష్టపడాల్సి వస్తుందని తెలుసు. రోజుల పాటు డైట్ చేశాను. నజీబ్ పాత్రలా మారేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే నా క్యారెక్టర్ శరీరాకృతి ద్వారా ప్రేక్షకులు ఆ కథను, క్యారెక్టర్‌ను అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కోసం నేను కఠినమైన ఆహార నియమాలు పాటించాను. 31 కిలోల బరువు తగ్గాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం గురించి మా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. నా భార్య, మా పాప సినిమా కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని సపోర్ట్‌గా నిలిచారు. నజీబ్ ఎడారిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొని ఉంటాడని ఊహించుకుంటూ ఈ క్యారెక్టర్‌లో నటించాను. కష్టపడినా నజీబ్ క్యారెక్టర్‌ను విజయవంతంగా పోషించినందుకు సంతోషంగా ఉంది.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నడిపించిన విషయం మేమొక గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకమే. ప్రేక్షకులకు ఒక స్పెషల్ మూవీ ఇవ్వబోతున్నామనే విశ్వాసంతోనే 16 ఏళ్లు సినిమాతో ముందుకు సాగాం. నజీబ్ అనే వ్యక్తి ఇప్పటికీ మన మధ్యే ఉన్నాడు. అతను తన జీవితం ద్వారా మనకు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పది. ఈ సినిమా కోసం సుదీర్ఘ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. ఏ నటుడు కూడా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందుకోలేడు. కొన్ని వదిలేయాల్సి వస్తుంటుంది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని సినిమాల్లో నటించలేకపోయాను. ఇలాంటి అరుదైన సినిమాకు పనిచేస్తున్నప్పుడు మిగతా ఆఫర్స్ వదులుకోవడం తప్పదు.


Prithviraj-Sukumaran-1.jpg

ఈ సినిమా కోసం తీవ్రమైన చలిలో, వేడి వాతావరణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం. ఏడారి జీవితాన్ని సజీవంగా తెరపై చూపించాలంటే అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయాలి. ఇందుకోసం మా మూవీ టీమ్ ప్రతిభావంతంగా పనిచేసింది. డైరెక్టర్ బ్లెస్సీ, నేను ఈ సినిమా రిలీజ్ కాబోతోన్న రోజు కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం. ఇది మా కల. ఆ కల నిజమవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు అవన్నీ దాటుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇంత కష్టపడిన సినిమా ప్రేక్షకుల దగ్గరకు చేరాలి. ఇందుకు పేరున్న దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్‌ను సెలెక్ట్ చేసుకున్నా.

తెలుగులో మా సినిమాను మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. మైత్రీ రవి గారికి ఫోన్ చేసి ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పాను. ఆయన మంచి రిలీజ్ చేద్దామని మాటిచ్చారు. మైత్రీ సంస్థ ద్వారా మా సినిమా ప్రేక్షకులకు విస్తృతంగా చేరువవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం మేము చాలా శ్రద్ధ తీసుకున్నాం. తెలుగు పాటల విషయంలో, డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లే తెలుగులోనూ నేనే డబ్బింగ్ చెప్పాను. (The Goat Life Movie)

లాస్ట్ ఇయర్ ‘సలార్’ (Salaar)లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్‌గా ఆదరించారు. ఇప్పుడు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమాలో ‘సలార్’కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. నజీబ్ క్యారెక్టర్‌లో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రేక్షకుల స్పందనతో తెలుసుకోవాలని అనుకుంటున్నా. నా కెరీర్ విషయానికి వస్తే అనుకోకుండానే నటుడిని అయ్యాను. మనం సినిమాలను కమర్షియల్, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ అంటూ విభజన చేస్తాం. కానీ నా దృష్టిలో మంచి సినిమాకు మంచి స్క్రిప్ట్ ఉండాలి. కమర్షియల్ మూవీస్‌లోనూ బలమైన కథా కథనాలు ఉంటాయి. మంచి నటులు తమకొచ్చే అరుదైన అవకాశాలు వదులుకోరని భావిస్తాను’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Manamey: శర్వానంద్ సినిమా ‘మనమే’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..

***********************

*Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..

******************************

*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..

**************************

Updated Date - Mar 26 , 2024 | 10:18 PM