Kalki 2898 AD: అమితాబ్‌పై కమల్‌హాసన్‌ కామెంట్స్‌.. కల్కి ఎందుకు చేస్తున్నారంటే!

ABN , First Publish Date - 2023-07-21T19:22:20+05:30 IST

శాన్‌ డియాగో వేదికగా జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ వేడుకలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ సరదాగా ముచ్చటించుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ కమల్‌హాసన్‌తో కలిసి నటించడం గురించి మాట్లాడారు. ‘

Kalki 2898 AD: అమితాబ్‌పై కమల్‌హాసన్‌ కామెంట్స్‌.. కల్కి ఎందుకు చేస్తున్నారంటే!

శాన్‌ డియాగో (San Diago) వేదికగా జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ వేడుకలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ (Kamal Haasan) సరదాగా ముచ్చటించుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ (amitabh bachchan )కమల్‌హాసన్‌తో కలిసి నటించడం గురించి మాట్లాడారు. ‘‘సినిమాలోని పాత్ర కోసం కమల్‌ ఎంతో కష్టపడతారు. ఆయన నటించే ప్రతి చిత్రం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ, ‘కల్కి 2898 ఏడీ’ మాత్రం చాలా ప్రత్యేకమైనది’’ అన్నారు.

ఈ మాటలకు స్పందించిన కమల్‌ హాసన్‌.. ‘‘నాకు అమితాబ్‌ నటించిన ‘షోలే’ సినిమా నచ్చలేదు. అది చూశాక రాత్రంతా నిద్రపోలేదు. ఆ దర్శకుడితో పనిచేసినప్పటికీ నేను ఇదే మాట చెప్పాను. ఒక టెక్నిషియన్‌గా నేను ఆ సినిమాను ఇష్టపడలేదు. ‘షోలే’ లాంటి సినిమాలు అమితాబ్‌ కెరీర్‌లో చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు అమితాబ్‌ నా సినిమాలపై ఇంతగా ప్రశంసలు కురిపిస్త్తారని ఊహించలేదు’’ అని కమల్‌ హాసన్‌ అన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను అంగీకరించడానికి కారణాన్ని రివీల్‌ చేశారు కమల్‌. ఒక సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో విలన్‌ పాత్రకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలో నేను ప్రతినాయకుడిగా కనిపించయబోతున్నా. విలన్‌ పాత్ర కాబట్టే దీన్ని అంగీకరించాను’’ అని చెప్పారు.

2.jpg

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌(Nag aswin)మాట్లాడుతూ ‘భారతీయ పురాణాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సూపర్‌ మ్యాన్‌, థోర్‌ లాంటి సూపర్‌ హీరోలకు హనుమంతుడికి పోలిక చెప్పే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. భారతీయ సినిమా గొప్పతనాన్ని నేను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. అందులో భాగమే ఈ సినిమా’’ అని అన్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Updated Date - 2023-07-21T19:36:36+05:30 IST