Kalki 2898 AD: భవిష్యత్తు కాశీ వీధుల నుంచి..

ABN , Publish Date - Mar 08 , 2024 | 05:36 PM

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898’ ఎడీ’. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్‌  ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు.

Kalki 2898 AD: భవిష్యత్తు కాశీ వీధుల నుంచి..


ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag aswin)  దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కల్కి 2898’ ఎడీ’ (Kalki 2898 AD). దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్‌  ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ క్యారెక్టర్‌ను రివీల్‌ చేశారు. ఇందులో ప్రభాస్‌ 'భైరవ’గా (Peabhas కనిపించనున్నారు. ఈ విషయాన్ని కొత్త పోస్టర్‌ విడుదల చేసి తెలిపారు. పోస్టర్‌లో ప్రభాస్‌ స్టైలిష్‌గా, ఇంటెన్స్  లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ లుక్‌ వైరల్‌ అవుతోంది

Kalki-2.jpg

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.  "మహాభారతం’, స్టార్‌ వార్స్‌... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాం. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్‌ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాం.’ అని తెలిపారు. 

ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తుండగా కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి.అశ్వినీదత నిర్మిస్తున్నారు. తాజాగా ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది

Updated Date - Mar 08 , 2024 | 05:39 PM