Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

ABN , Publish Date - Jan 20 , 2024 | 09:00 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన ఈ డీప్‌ఫేక్ వీడియో సృష్టికర్తని దిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24) అనే అతను ఈ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినట్లుగా దిల్లీ డీసీపీ హేమంత్‌ తివారీ వెల్లడించారు.

Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్
Rashmika Mandanna

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన ఈ డీప్‌ఫేక్ వీడియో సృష్టికర్తని దిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24) అనే అతను ఈ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినట్లుగా దిల్లీ డీసీపీ హేమంత్‌ తివారీ వెల్లడించారు. అతన్ని ఏపీలోనే అరెస్ట్ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

గతేడాది నవంబర్‌లో ‌నిందితుడు రష్మికపై ఈ డీప్‌ ఫేక్ (Rashmika Deepfake Video) వీడియోను సృష్టించారు. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు సీరియస్‌గా స్పందించడమే కాకుండా.. రష్మికకు మద్దతుగా నిలబడ్డారు. నిందితులు వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్ 465, 469 కింద దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుల కోసం వేట ప్రారంభించగా.. ఇప్పటికి అతని ఆచూకీని కనుగొన్నారు. నిందితుడి నుండి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని, రష్మిక పేరుతో ఫ్యాన్స్‌ పేజీని నడిపిన నిందితుడు.. ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకునేందుకే ఈ వీడియోని రూపొందించినట్లు చెప్పాడని డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. ఇంకా కొందరి ప్రముఖుల పేర్లతోనూ ఫ్యాన్స్‌ పేజీలను నడిపినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. (AP Person Arrested)


DeepFake.jpg

మరి అసలు నిందితుడు ఇతనేనా, ఇంకా అతనితో పాటు వేరే బ్యాచ్ ఉందా? ఈ అరెస్ట్‌తో ఈ డీప్ ‌ఫేక్ వీడియోలకు ఫుల్ స్టాప్ పడిందని అనుకోవచ్చా? వంటి విషయాలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. రష్మిక విషయానికి వస్తే.. రీసెంట్‌గా ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న రష్మిక.. ప్రస్తుతం ‘పుష్ప2’, ‘రెయిన్ బో’ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది.


ఇవి కూడా చదవండి:

====================

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

Updated Date - Jan 20 , 2024 | 09:00 PM