Gaami: ‘గామి’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Feb 29 , 2024 | 06:15 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్ ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో లాంఛ్ చేశారు. PCX ఫార్మాట్‌లో లాంచ్ చేసే మొట్టమొదటి ట్రైలర్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించింది.