Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:39 PM

‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన 5 అడుగుల 3 అంగుళాలు అనే కామెంట్‌పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇది ఇండస్ట్రీలోని ఓ హీరోని ఉద్దేశిస్తూ.. నాగబాబు ఈ కామెంట్స్ చేశారని, ఆయనని ఆ హీరో ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా నాగబాబు రియాక్ట్ అయ్యారు. తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెబుతూ.. ఆ మాటలు ఎవరినైతే బాధించాయో.. వారిని క్షమించమని అడిగారు.

Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..
Mega Brother Nagababu

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). మార్చి 1న విడుదల కాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం రీసెంట్‌గా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) చేసిన 5 అడుగుల 3 అంగుళాలు అనే కామెంట్‌పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇది ఇండస్ట్రీలోని ఓ హీరోని ఉద్దేశిస్తూ.. నాగబాబు ఈ కామెంట్స్ చేశారని, ఆయనని ఆ హీరో ఫ్యాన్స్ తెగ ట్రోల్ (Trolling) చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా నాగబాబు రియాక్ట్ అయ్యారు. తన మాటను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెబుతూ.. ఆ మాటలు ఎవరినైతే బాధించాయో.. వారిని క్షమించమని అడిగారు.

నాగబాబు విడుదల చేసిన లేఖలో.. ‘‘ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది. 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకుని ఉంటే.. I am Really Very sorry. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కానీ.. వాంటెడ్‌గా అన్న మాటలు కాదు, అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.. -మీ నాగబాబు’’ అని తెలిపారు. (Nagababu Says Sorry)


Nagababu.jpg

నాగబాబు విడుదల చేసిన ఈ లేఖకు కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. కొందరు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. మాట్లాడే ముందు కాస్త వెనుకా ముందు చూసుకుని మాట్లాడాలి సార్.. అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. మొత్తంగా అయితే నాగబాబు క్షమాపణలు కోరాడు కాబట్టి.. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని భావించవచ్చు.


ఇవి కూడా చదవండి:

====================

*Sree Vishnu: ‘రాజ రాజ చోర’ కాంబినేషన్ రిపీట్.. ఈసారి అచ్చతెలుగు సినిమా!

**************************

*Save The Tigers: ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 1’ ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటి వరకంటే?

******************************

*BBN: రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్.. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్రయూనిట్..

**************************

Updated Date - Feb 29 , 2024 | 01:39 PM