scorecardresearch

SV18: గీతా ఆర్ట్స్‌లో సినిమా.. శ్రీ విష్ణు రియాక్షన్ చూశారా..

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:24 PM

హీరో శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్‌లో చేయబోతున్న సినిమాను ఆయన బర్త్‌‌డే స్పెషల్‌గా వినూత్నంగా రివీల్ చేశారు. శ్రీవిష్ణు, గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్‌డే ప్రజెంటేషన్ అందుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే అతని నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది. గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

SV18: గీతా ఆర్ట్స్‌లో సినిమా.. శ్రీ విష్ణు రియాక్షన్ చూశారా..
Hero Sree Vishnu

ఫిబ్రవరి 29.. హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న, చేయబోతున్న సినిమాల అనౌన్స్‌మెంట్స్‌తో పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts)లో చేయబోతున్న సినిమాను వినూత్నంగా రివీల్ చేశారు. శ్రీవిష్ణు, గీతా ఆర్ట్స్ నుండి అద్భుతమైన బర్త్‌డే ప్రజెంటేషన్ అందుకున్నారు. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వం వహించే అతని నెక్స్ట్ చిత్రం కోసం ప్రొడక్షన్ హౌస్ శ్రీ విష్ణుతో కొలాబరేషన్ అనౌన్స్ చేసింది. గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

SV18 ప్రకటనను గ్రాండ్‌గా వీడియో ద్వారా రివీల్ చేశారు. ఈ వీడియోలో గీతా ఆర్ట్స్ నుండి శ్రీవిష్ణుకి గిఫ్ట్ అందుతుంది. గిఫ్ట్ బాక్స్ లోపల ఒక పజిల్ ఉందని తెలుసుకున్న శ్రీ విష్ణు.. ఆ పజిల్‌ని పరిష్కరించినప్పుడు, అది గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన కొత్త సినిమా గురించి అని తెలుసుకుంటాడు. చాలా కాలంగా బిగ్ బ్యానర్‌లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఇది ఖచ్చితంగా బిగ్ బర్త్ డే ప్రెజెంటేషన్. ఈ గిఫ్ట్ చూసిన శ్రీ విష్ణు ఎగ్జయిట్ అవుతూ.. వెంటనే అరవింద్‌గారికి ఫోన్ చేస్తుండటాన్ని ఈ వీడియోలో చూపించారు. (Sree Vishnu 18th Film Announced)


SV18.jpg

SV18 ఒక మంచి ప్రేమకథతో పాటు ఫన్ రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉండబోతుందని.. ప్రముఖ టెక్నీషియన్లు ఈ క్రేజీయస్ట్ కాంబినేషన్‌లో భాగం కాబోతున్నారని మేకర్స్ తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 05:26 PM