Save The Tigers: ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 1’ ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటి వరకంటే?

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:28 PM

‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 త్వరలో రాబోతున్న నేపథ్యంలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ను మార్చి 10వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ. ఈ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది.

Save The Tigers: ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 1’ ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటి వరకంటే?
Save The Tigers Web Series Still

సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers) ను మార్చి 10వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీ సంస్థ. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 (Save The Tigers Season 2) త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ఇస్తోంది. ఈ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ‌లో ఒక సక్సెస్‌పుల్ వెబ్ సిరీస్‌గా పేరుగాంచింది. ఇప్పుడీ సిరీస్ సీజన్ 2 అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.


Save-the-Tigers-Web-series.jpg

భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. మహి వి. రాఘవ్ (Mahi V Raghav), చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్‌కు తేజ కాకుమాను (TEJA Kakumanu) దర్శకత్వం వహించారు. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా.. కాదు కాదు అంతకు మించి సీజన్ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్‌ను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ప్రకటించనుంది.


ఇవి కూడా చదవండి:

====================

*BBN: రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్.. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్న చిత్రయూనిట్..

**************************

*Drugs Case: పోలీసు విచారణలో క్రిష్‌!.. రాడిసన్‌లోని జంట గదులపై ఫోకస్‌

*******************************

*Dil Raju: ‘లవ్ మీ’ కథ వినగానే.. ‘ఆర్య’కు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. అలా ఎగ్జైట్ అయ్యా..

**************************

Updated Date - Feb 28 , 2024 | 12:28 PM