HanuMan: ఫోర్త్ సింగిల్ ‘శ్రీ రామధూత స్తోత్రం’

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:38 PM

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, టీం ‘హనుమాన్’ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా పై ఎక్సయిట్మెంట్‌ని పెంచుతున్నారు. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. అవన్నీ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుండి ఫోర్త్ సింగిల్ ‘శ్రీ రామధూత స్తోత్రం’ లిరికల్ వీడియోని మేకర్స్ వదిలారు.