Manamey: ‘ఇక నా మాటే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:46 PM

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న 35వ చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా.. కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ ‘ఇక నా మాటే’ని మేకర్స్ విడుదల చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.