Gangs Of Godavari X Review: గోదారేనా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్విట్టర్ ఎక్స్ టాక్ ఏంటి ఇలా ఉంది..

ABN , Publish Date - May 31 , 2024 | 10:37 AM

వైవిధ్య కథలతో హీరోగా తనకంటూ ఓ స్టార్‌డమ్ సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది.

Gangs Of Godavari X Review: గోదారేనా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్విట్టర్ ఎక్స్ టాక్ ఏంటి ఇలా ఉంది..
Gangs Of Godavari Movie Still

వైవిధ్య కథలతో హీరోగా తనకంటూ ఓ స్టార్‌డమ్ సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Das Vishwak Sen) నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి (Neha Shetty), అంజలి (Anjali) కథానాయికలుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచగా.. రీసెంట్‌గా బాలయ్య (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరైన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో సినిమా భారీగా ఫేమస్ అయింది. దీంతో ఈ సినిమా చూడాలనే ఇంట్రస్ట్‌ని ప్రేక్షకులలో కలిగించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక నేడు (మే 31) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా‌ ఎలా ఉందో.. ఇప్పటికే చూసేసిన కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ ఎక్స్ టాక్ ఎలా ఉందంటే.. (Gangs Of Godavari X Review)

*Super Star Krishna: నా ప్రతి జ్ఞాపకంలోనూ జీవించే ఉంటారు.. మహేష్ ట్వీట్ వైరల్


‘‘ఫైనల్‌గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చూసేశాను. చూడదగిన చిత్రం. కొన్ని సీన్స్ బోర్ కొట్టినప్పటికీ.. స్ర్కీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉంది. నేహా శెట్టి వన్ మ్యాన్ షో అనేలా ఆకర్షిస్తుంది..’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. (Gangs Of Godavari Twitter Talk)

‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్టాఫ్ మంచి యాక్షన్ బ్లాక్స్‌తో డీసెంట్‌గానే ఉంది. బాబోయ్ సెకండాప్ మాత్రం దారుణంగా ఉంది. డ్రాగీ మరియు భయంకరమైన సీన్లతో సెకండాఫ్ ఉంది. విలన్లు కామెడీగా కనిపిస్తారు.. అలాగే సరైన సంఘర్షణ కూడా సినిమాలో లేదు. హీరోయిన్ డమ్మీ. యువన్ శంకర్ రాజా బీజీఎమ్, విశ్వక్ సేన్ నటన మాత్రమే ఈ సినిమాకు హైలెట్..’’ అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయం వెల్లడించారు. (Gangs Of Godavari Twitter Review)


ఓవరాల్‌గా అయితే మాత్రం విశ్వక్ ‌సేన్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. రఫ్ అండ్ రస్టిక్ రోల్‌లో విశ్వక్ విజృంభించేశాడని, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, ఇందులోని నటన అతని కెరీర్‌లోనే బెస్ట్ అవుతుందనేలా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కొంత పాజిటివ్‌గా, కొంత నెగిటివ్‌గా.. ఇలా ట్విట్టర్ ఎక్స్‌లో ప్రస్తుతానికి మిక్స్‌డ్ రెస్పాన్స్‌ వస్తోంది. అసలీ సినిమా ఎలా ఉందీ అనేది కాసేపట్లో రివ్యూలో తెలుసుకుందాం..

Read Latest Cinema News

Updated Date - May 31 , 2024 | 10:37 AM