సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ గర్వపడే చిత్రమిదట..

ABN , Publish Date - Jan 16 , 2024 | 05:54 PM

సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘కృష్ణ విజయం’. అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ ఫ్యాన్స్‌ని ప్రత్యేక షో ద్వారా చూపించారు. సినిమా చూసిన అనంతరం ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ గర్వపడే చిత్రమిదట..
Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) నటించిన చివరి చిత్రం ‘కృష్ణ విజయం’ (Krishna Vijayam). అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలి, సూర్య, గీతా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. చిత్రయూనిట్‌తో పాటు దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, నిర్మాతలు ఎస్.వి.శోభారాణి, జె.వి.మోహన్ గౌడ్, గిడుగు క్రాంతి కృష్ణ, బిజినెస్ కో ఆర్డినేటర్ నారాయణ, ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ పాల్గొని.. చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ‘కృష్ణ విజయం’ చిత్రాన్ని కృష్ణ, మహేష్ ఫ్యాన్స్‌కు ప్రదర్శించారు. (Krishna Vijayam Movie Pre Release Event)

Krishna.jpg

ఈ సందర్భంగా ‘గుంటూరు కారం’ సాధిస్తున్న సంచలన విజయాన్ని పురస్కరించుకుని సక్సెస్ కేక్ కట్ చేశారు. కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్ననలు అందుకుంటున్న మధుసూదన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం చాలా బాగుందని, ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని హాజరైన అతిథులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ ఫ్యాన్స్ (Super Star Krishna and Mahesh Babu Fans) అంతా గర్వపడేలా ‘కృష్ణ విజయం’ చిత్రాన్ని తీర్చిదిద్దిన మధుసూదన్ అభినందనీయులని పేర్కొన్నారు.


Krishna-Vijayam.jpg

సూపర్ స్టార్ కృష్ణను దర్శకత్వం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా చిత్ర దర్శకుడు మధుసూదన్ పేర్కొన్నారు. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అన్ని పాటలు భాస్కరభట్ల రాశారని, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శకుడు మధుసూదన్ (Madhusudhan Havaldar) తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం

***************************

*Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

**************************

*Akira Nandan: పవన్ మిస్.. అయితేనేం పండగ వేళ ఆయన వారసుడి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!

*************************

*Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

**********************

Updated Date - Jan 16 , 2024 | 05:54 PM