Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

ABN , Publish Date - Jan 16 , 2024 | 11:34 AM

కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కి.. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మొదటి రోజు రూ. 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టగా.. రెండో రోజులకు గానూ రూ. 17.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..
King Nagarjuna in Naa Saami Ranga

కింగ్ నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కి.. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. నాగార్జునకు జోడిగా ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా లిమిటెడ్ థియేటర్లలో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతూ.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం రెండు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

Naa-Saami-Ranga.jpg

ఈ పోస్టర్ ప్రకారం మొదటి రోజు కంటే కూడా రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు అనేలా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు ‘నా సామిరంగ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 8.6 కోట్ల కలెక్షన్స్ రాబడితే.. రెండు రోజులకు కలిసి రూ. 17.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. వారు విడుదల చేసిన పోస్టర్ ప్రకారం రెండో రోజు రూ. 9.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. మొదటి రోజు కంటే రెండో రోజు హయ్యస్ట్ కలెక్షన్స్‌ని రాబట్టిన చిత్రాల లిస్ట్‌లో చేరింది. మూడో రోజు కూడా ఈ సినిమాకు చాలా వరకు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే ఈ సంక్రాంతికి లేట్‌గా వచ్చినా ‘నా సామిరంగ’ డీసెంట్ హిట్‌ని ఖాతాలో వేసుకుంది.


King-Nagarjuna.jpg

ఇందులో నాగార్జున ఊరమాస్ డైలాగ్స్, నటనతో పాటు అల్లరి నరేష్ ఎమోషనల్ టచ్, ఆషికా గ్లామర్, కీరవాణి సంగీతం.. సంక్రాంతికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇందులో ఉందనే ఫీల్‌ని ఇవ్వడంతో.. సినిమా చూసిన వారంతా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. రొటీన్ కథే అనే టాక్ వచ్చినా.. నాగార్జున మరోసారి మ్యాజిక్ చేసి సంక్రాంతి కింగ్ అనిపించుకుంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్ కూడా భారీగా ఏం లేవు కాబట్టి.. ఈ సినిమా అన్ని ఏరియాల్లో లాభాలను రాబట్టడం కాయం అనేలా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

************************

*Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

**************************

*K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..

****************************

*Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల

****************************

Updated Date - Jan 16 , 2024 | 11:49 AM