HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం

ABN , Publish Date - Jan 16 , 2024 | 04:21 PM

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘హను-మాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగిస్తూ.. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. సూపర్ హీరో కథాంశంతో వచ్చిన ఈ ఫాంటసీ ఫిల్మ్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఫలితంగా ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే రూ. 100 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. మరోసారి తెలుగు సినిమా సత్తాని చాటింది.

HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం
HanuMan Movie Posters

సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ‘హను-మాన్’ (Hanu-Man) చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగిస్తూ.. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. సూపర్ హీరో కథాంశంతో వచ్చిన ఈ ఫాంటసీ ఫిల్మ్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఫలితంగా ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే రూ. 100 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టి.. మరోసారి తెలుగు సినిమా సత్తాని చాటింది. అందులోనూ లిమిటెడ్ స్ర్కీన్స్, నార్మల్ టికెట్ల రేట్లతో ఈ ఫీట్ సాధించడం అంటే మాములు విషయం కాదు. విడుదలకు ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్స్‌తోనే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన ఈ ‘హను-మాన్’కు.. విడుదల తర్వాత ఇప్పటికీ టికెట్స్ దొరకడం లేదంటే.. ప్రేక్షకులు ఎంతగా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంది.. ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. రూ. 100 కోట్లు నిదర్శనం అని. (100 Crores to HanuMan)

Hanu-Man-1.jpg

నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి 2024లో మొట్టమొదటి బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఇది ఇంతటితో ఆగే విజయం కాదు.. ఈ విజయానికి సరిహద్దు ఏమిటనేది తెలియాలంటే ఇంకో రెండు మూడు వారాలైనా పడుతుంది. ఎందుకంటే.. థియేటర్ల వద్ద ఈ హనుమంతుడిని చూసేందుకు జనాలు అలా క్యూ కడుతున్నారు మరి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా.. విడుదలైన అన్ని చోట్ల, విడుదలైన అన్ని భాషల్లో ‘హను-మాన్’ ఆధిపత్యం కనబడుతోంది. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీగా వచ్చిన ‘హను-మాన్’ చిత్రం.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తూ.. మరోసారి టాలీవుడ్ గురించి అన్ని సినిమా ఇండస్ట్రీలు మాట్లాడుకునేలా చేస్తుందన్నది మాత్రం కాదనలేని వాస్తవం. (HanuMan Movie Collections)


HanuMan-2.jpg

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమాలో తేజా సజ్జా (Teja Sajja), అమృత అయ్యర్ (Amritha Aiyer) హీరోహీరోయిన్లుగా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి ఇతర పాత్రలలో నటించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ ‘జై హనుమాన్’ ఉంటుందని కూడా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా వందకోట్ల కలెక్షన్స్ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇది నా మొట్టమొదటి వందకోట్ల ఫిల్మ్ అని ట్వీట్ చేస్తే.. ఇది నా జెర్సీ మూమెంట్ అని తేజ సజ్జా ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

**************************

*Akira Nandan: పవన్ మిస్.. అయితేనేం పండగ వేళ ఆయన వారసుడి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!

*************************

*Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

**********************

*Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

************************

Updated Date - Jan 16 , 2024 | 04:21 PM