Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

ABN , Publish Date - Jan 16 , 2024 | 02:32 PM

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్‌ని పురస్కరించుకుని ఈ చిత్ర సెకండ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్
Suriya in Kanguva

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ (Kanguva). ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ (Siva) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో తాజాగా ‘కంగువ’ సెకండ్ లుక్‌ (Kanguva Second Look)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సెకండ్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్‌లో సూర్య.. తన ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చారు. అదెలా అంటే, యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ క్యారెక్టర్‌లోనూ కనిపించి సూర్య సర్‌ప్రైజ్ చేశారు. ‘విధి.. కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్... కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే..కంగువ’ అంటూ సెకండ్ లుక్ సందర్భంగా మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. సెకండ్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండటమే కాకుండా.. సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేస్తోంది. హై క్వాలిటీ ప్రొడక్షన్ వేల్యూస్, మెస్మరైజ్ చేసే సూర్య స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘కంగువ’ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీదకు గ్రాండ్‌గా రానుంది. (Kanguva Movie)


Kanguva.jpg

సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తర్వాత ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వదిలిన సెకండ్ లుక్ కూడా.. ఈ సినిమా స్థాయిని తెలియజేస్తుంది. ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ని రీ ట్వీట్స్ చేస్తూ.. యూనిట్‌కు, హీరో సూర్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Akira Nandan: పవన్ మిస్.. అయితేనేం పండగ వేళ ఆయన వారసుడి లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా!

*************************

*Naa Saami Ranga: మొదటి రోజు కంటే రెండో రోజు కిష్టయ్య కుమ్మేశాడు..

**********************

*Mahesh Babu: ‘గుంటూరు కారం’ టీమ్‌కి మహేష్ గ్రాండ్ పార్టీ.. ఫొటోలు వైరల్

************************

*Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

**************************

Updated Date - Jan 16 , 2024 | 02:32 PM