Chiranjeevi: ‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ సపోర్ట్.. ఏం చేశారంటే?

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:30 PM

‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ అందించారు. ఆర్‌టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న సినిమా ‘సుందరం మాస్టర్’. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కాబోతోన్న సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

Chiranjeevi: ‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ సపోర్ట్.. ఏం చేశారంటే?
Megastar Chiranjeevi

‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సపోర్ట్ అందించారు. ఆర్‌టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న సినిమా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master). హర్ష చెముడు (Harsha Chemudu), దివ్య శ్రీపాద (Divya Sripada) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కాబోతోన్న సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. హైదరాబాద్‌లో మేకర్స్ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించగా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Harsha.jpg

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్’ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. హర్ష.. తనకు తాను, తన టాలెంట్‌ను నమ్ముకుని ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాత సుధీర్, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆసాంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందనేది ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు కాబట్టి.. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందని అన్నారు. (Sundaram Master Trailer)


Sundaram-Master-Pic.jpg

హర్ష చెముడు మాట్లాడుతూ.. మాలాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవిగారికి ధన్యవాదాలు. సుందరం మాస్టర్ సినిమా చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ప్రతీ సారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు నచ్చింది.. కాబట్టి చేశాను. నేను చేయగలిగిన పాత్రలే ఉంటే తప్పకుండా చేస్తాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. ఇందులో కామెడీతో పాటు అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నానని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun: జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. అందుకే..

***************************

*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

***********************

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

Updated Date - Feb 15 , 2024 | 06:30 PM