scorecardresearch

Allu Arjun: జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. అందుకే..

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:41 PM

‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినయానికి దేశం మొత్తం దాసోహమైంది. అంతర్జాతీయంగానూ ఆ సినిమా బన్నీకి గుర్తింపును తీసుకురావడంతో.. ఒక్కసారిగా బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. టాలీవుడ్ చరిత్రలో లేని విధంగా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును సైతం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయనకు 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం రావడంతో.. జర్మనీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Allu Arjun: జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. అందుకే..
Allu Arjun

‘పుష్ప’ (Pushpa) సినిమాలో పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అభినయానికి దేశం మొత్తం దాసోహమైంది. అంతర్జాతీయంగానూ ఆ సినిమా బన్నీకి గుర్తింపును తీసుకురావడంతో.. ఒక్కసారిగా బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. టాలీవుడ్ చరిత్రలో లేని విధంగా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డును సైతం అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఇంకా ‘పుష్ప’ హవా కొనసాగుతూనే ఉందంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను సొంతం చేసుకున్న ‘పుష్ప’ చిత్రానికి ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు లభించింది. 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (74th Berlin International Film Festival) ఆహ్వానం ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్‌కి రావడంతో.. ఆయన పేరు మరోసారి వార్తలలో ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జర్మనీకి వెళుతున్న అల్లు అర్జున్ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు అల్లు అర్జున్‌కు ఆహ్వానం రావడంతో.. ఆయన ఫ్యాన్స్ మరోసారి గడ్డం కింద చేతులు తిప్పుతూ డైలాగ్స్ చెబుతున్నారు. ఎందుకంటే, ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌కు టాలీవుడ్ తరపున వెళ్తున్న ఏకైక హీరో అల్లు అర్జునే కాబట్టి. అందుకే అల్లు అర్జున్ జర్మనీ వెళ్లే నిమిత్తం.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చిన వీడియోని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్‌లో పాల్గొంటోన్న విషయం తెలిసిందే.


Bunny.jpg

‘పుష్ప’కు వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పుడు చేస్తున్న ఈ ‘పుష్ప 2’ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. దర్శకుడు సుకుమార్ కూడా పార్ట్ 2 ఓ రేంజ్‌లో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ మధ్య ‘పుష్ప’కు పార్ట్ 3 కూడా ఉంటుందనేలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. పార్ట్ 3పై క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం ‘పుష్ప’ పార్ట్ 2 మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2024, ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

====================

*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

***********************

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

Updated Date - Feb 15 , 2024 | 04:41 PM