Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:55 PM

‘డీజే టిల్లు’ చిత్రంతో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రేంజే మారిపోయింది. ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్‌ డేని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..
Tillu Square Movie Posters

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు పలికిన ‘అట్లుంటది మనతోని’ వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు సామాన్యులలో కూడా రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) అని ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకోగా.. ఈ సీక్వెల్‌లో మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తామని చిత్రం బృందం ఎంతో నమ్మకంగా ఉంది. చిత్రబృందం చెప్పినట్లుగానే ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి నో లిమిట్స్ అనేలా.. తాజాగా వచ్చిన ట్రైలర్ తెలియజేస్తోంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘టిల్లు’ ఫిల్మ్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉందని ఈ ట్రైలర్‌తో స్పష్టమవుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె, పక్కింటి అమ్మాయిలా ఉంటుందనే తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లుక్స్‌తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.


Anupama.jpg

మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌ను మలిచారు. రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌తోనే ఆయన.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి భాగాన్ని మించి అలరించనున్నామనే నమ్మకాన్ని కలిగించగలిగారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Tillu Square Trailer)


ఇవి కూడా చదవండి:

====================

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

*Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

**********************

*Kayal Anandhi: ఆనంది ‘వైట్‌ రోజ్‌’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..

*************************

Updated Date - Feb 14 , 2024 | 06:55 PM