Movie Opening: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:19 PM

ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త కంటెంట్‌తో చిత్రానికి శ్రీకారం చుట్టింది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పి. చలపతి కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివ ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Movie Opening: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం
Movie Opening Pic

ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కంటెంట్ నచ్చితే.. ఆ సినిమాలను ప్రేక్షకులు సక్సెస్ చేస్తున్నారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఏదైనా కొత్త కంటెంట్‌తో వచ్చే సినిమాలే బాక్సాఫీస్ వద్ద కూడా నిలబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ కొత్త ప్రొడక్షన్ కంపెనీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త కంటెంట్‌తో చిత్రానికి శ్రీకారం చుట్టింది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ (Sri Kamalahasini Movie Makers) బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పి. చలపతి కుమార్ (P Chalapathi Kumar) దర్శకత్వంలో లక్ష్మీ (Lakshmi) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివ ప్రసాద్ (Siva Prasad) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

*Samantha: ఎట్టకేలకు అభిమానులకు  బంగారం లాంటి అప్‌డేట్‌!


ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సినిమా ఆఫీస్‌లో నిర్వహించారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందాన్ని ప్రకటించనున్నారు. అటుపై గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి మహవీర్ సంగీత దర్శకుడు. పి. శ్రీనివాస్, హరీష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లుగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. (Sri Kamalahasini Movie Makers Production No 1 Movie Update)

Updated Date - Apr 28 , 2024 | 09:19 PM