Tollywood: ‘లవ్ మీ’, ‘లవ్ మౌళి’.. ఈ సినిమాలకు ఏమైంది.. వాయిదా అందుకేనా!

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:48 PM

టాలీవుడ్‌లో వాయిదాల పర్వం మొదలైంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. అందుకు కారణం ఒకటి ఐపీఎల్ అయితే.. రెండోది ఎన్నికల సీజన్. అసలే ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకి రావడం లేదు బాబోయ్ అని సినిమా వాళ్లు బాధపడుతుంటే.. ఇప్పుడు వీటి పుణ్యమా అని.. థియేటర్లకు ప్రేక్షకుల వచ్చే పరిస్థితి అస్సలు కనబడటం లేదు. అందుకే మేకర్స్ వాయిదా వేస్తున్నారు.

Tollywood: ‘లవ్ మీ’, ‘లవ్ మౌళి’.. ఈ సినిమాలకు ఏమైంది.. వాయిదా అందుకేనా!
Love Me, Love Mouli, Sasivadane Movie Stills

టాలీవుడ్‌ (Tollywood)లో వాయిదాల పర్వం మొదలైంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతున్నాయి. అందుకు కారణం ఒకటి ఐపీఎల్ అయితే.. రెండోది ఎన్నికల సీజన్. అసలే ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకి రావడం లేదు బాబోయ్ అని సినిమా వాళ్లు బాధపడుతుంటే.. ఇప్పుడీ వేసవి సీజన్ మొత్తం ఐపీఎల్‌ (IPL), ఎన్నికల (Elections) పుణ్యమా అని.. థియేటర్లకు ప్రేక్షకుల వచ్చే పరిస్థితి అస్సలు కనబడటం లేదు. అందుకే పెద్ద హీరోల సినిమాలన్నింటినీ ఆయా నిర్మాతలు ముందుగానే వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిన్న, ఓ మోస్తరు సినిమాలను కూడా వాయిదా వేస్తున్నారంటే.. ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మరీ.. సడెన్‌గా వాయిదా పడుతున్న సినిమాలేంటో చూద్దాం

*Tenant: ఎవరితోనో పోటీ పడాలనే కోరిక నాకు లేదు: సత్యం రాజేష్


‘లవ్ మీ’ (Love Me)

దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో.. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తోన్న చిత్రం ‘లవ్ మీ’. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఐపీఎల్, ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా వాయిదాకు సంబంధించి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


‘లవ్, మౌళి’ (Love Mouli)

నవదీప్ కొంత విరామం తర్వాత హీరోగా చేస్తోన్న చిత్రం ‘లవ్, మౌళి’. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుద‌ల చేయబోతున్నట్లుగా చిత్ర‌యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడీ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా నవదీప్ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నవదీప్ కూడా ట్విట్టర్ వేదికగా.. ‘‘ఏం లేదు గురు, రిలీజ్‌లో చిన్న డిలే.. చెప్పుకోలేను కారణాలు, ఏం చేస్తా.. కొత్త రిలీజ్ డేట్‌తో ఫస్ట్ మీ దగ్గరకే వస్తా.. అప్పటి వరకు లవ్, నవదీప్’’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి.. సినిమా వాయిదా అనే విషయాన్ని తెలియజేశారు.

‘శశివదనే’ (Sasivadane)

‘లవ్ మీ’, ‘లవ్, మౌళి’ బాటలోనే.. రిలీజ్ డేట్ ప్రకటించుకున్న చిత్రం ‘శశివదనే’. ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా.. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్. స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న భారీగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రమోషన్స్ పరంగా చూస్తే.. ఈ సినిమా కూడా వాయిదా పడినట్లుగానే తెలుస్తోంది.

Updated Date - Apr 17 , 2024 | 04:48 PM