Samantha: ఎట్టకేలకు  అభిమానులకు  బంగారం లాంటి అప్‌డేట్‌!

ABN , Publish Date - Apr 28 , 2024 | 06:08 PM

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్  సమంత (Samantha) నుంచి కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు  ఆమె అభిమానులు. అయితే తాజాగా 'బంగారం’లాంటి కబురు చెప్పింది సామ్‌. తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రం టైటిల్‌తో కూడిన పోస్టర్‌ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

Samantha:  ఎట్టకేలకు  అభిమానులకు  బంగారం లాంటి అప్‌డేట్‌!


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్  సమంత (Samantha) నుంచి కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు  ఆమె అభిమానులు. అయితే తాజాగా 'బంగారం’లాంటి కబురు చెప్పింది సామ్‌. తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రం టైటిల్‌తో కూడిన పోస్టర్‌ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. కొంత గ్యాప్‌ తర్వాత ఆమె నటిస్తున్న ఈ చిత్రానికి 'మా ఇంటి బంగారం’ (Maa inti Bangaram) అని టైటిల్‌పెట్టారు. టైటిల్‌ సున్నితంగా ఉంది కానీ పోస్టర్‌లో హీరోయిన్  లుక్‌ మాత్రం వైలెంట్‌గా ఉంది. వివాహం అనంతరం చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ఆమె తుపాకీ చేతపట్టినట్టు పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. మరి, ఈ గృహిణి కథేంటి? ఆమె భర్త ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.



టైటిల్‌ మినహా దర్శకుడు, సాంకేతిక బృందం వివరాలు ఏమీ తెలియపరచలేదు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’పై రూపొందుతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ సర్‌ప్రైజ్‌తో ఆమె ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘తలైవి ఈజ్‌ బ్యాక్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గత ఏడాది ‘ఖుషి’తో అలరించిన సామ్‌ ‘సిటడెల్‌: హనీ- బన్నీ’తో త్వరలోనే సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన హీరోగా నటించారు. రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్  కానుంది.

Updated Date - Apr 28 , 2024 | 06:12 PM