40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saripodhaa Sanivaaram: దిల్ రాజు చేతుల్లోకి.. డివివి వాళ్ల సినిమా

ABN, Publish Date - Jan 20 , 2024 | 10:26 PM

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ క్రేజీ కాంబినేషన్‌ సినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏపీ మరియు తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ని ఎస్‌విసి సంస్థ సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Nani in Saripodhaa Sanivaaram

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) రెండోసారి కలిసి పని చేస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఈ క్రేజీ కాంబినేషన్‌ సినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రెండు అప్‌డేట్స్‌ని వదిలారు. అందులో ఒకటి ఏమిటంటే.. ఈ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఈ చిత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ (AP and Telangana Theatrical Rights)ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదలకానుంది. రెండో అప్‌డేట్ విషయానికి వస్తే.. వెర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యుల్‌లో ఎస్ జే సూర్య (SJ Suryah) జాయిన్ అయినట్లుగానూ, ఈ చిత్రంలో ఆయన పాత్ర డైనమిక్‌గా ఉండబోతుందని మేకర్స్ తెలియజేశారు. ఈ రెండు అప్‌డేట్స్‌తో ‘సరిపోదా శనివారం’ టైటిల్ శనివారం ట్రెండ్ అయింది.


ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అన్‌చెయిన్డ్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో నాని రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Rashmika Mandanna: రష్మిక డీప్‌ ఫేక్ వీడియో.. ఏపీ వ్యక్తి అరెస్ట్

****************************

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

Updated Date - Jan 20 , 2024 | 10:26 PM