Ooru Peru Bhairavakona: మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:28 PM

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా తాజాగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.

Ooru Peru Bhairavakona: మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు
Ooru Peru Bhairavakona Press Meet

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా తాజాగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఊరు పేరు భైరవకోన’ వంటి అద్భుతమైన చిత్రాన్ని నాకు ఇచ్చిన దర్శకులు విఐ ఆనంద్‌గారికి థాంక్స్. దాదాపు రెండున్నరేళ్ళ పాటు ఈ సినిమా కోసం నిరంతరం కష్టపడ్డారు. ఆయన మొదటి సినిమా కూడా నాతోనే చేయడం గర్వంగా భావిస్తాను. అనిల్ సుంకర గారితో ఎంతో మంచి అనుబంధం వుంది. సాధారణంగా నిర్మాతగా ఆయన పేరు వేసుకోరు. కానీ నేను పట్టుపట్టి ‘నిను వీడని నీడను నేను’ సినిమాకి వేశాను. అది మాకు చాలా కలిసొచ్చింది. రాజా ‘హాస్య మూవీస్’ నా హోం బ్యానర్ లాంటిది. ఊరు పేరు భైరవకోన చాలా స్పెషల్ మూవీ. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్న మంచి కమర్షియల్ తెలుగు సినిమా ఇది. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఎప్పుడూ అండగా వుండే ప్రేక్షకులకు కృతజ్ఞతలని తెలిపారు.


Varsha-Bollamma.jpg

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సందీప్, దర్శకుడు, టీం అంతా పడిన శ్రమ అర్ధమౌతుంది. సినిమా చూశాను. దర్శకుడు ఆనంద్ చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తీశాడు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నామని అన్నారు. దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. ఊరు పేరు భైరవకోన అద్భుతమైన జర్నీ. ప్రతి మూమెంట్ మాకు ఓ కొత్త అనుభవం. ఊరు పేరు భైరవకోన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్, సూపర్ నేచురల్ ఫాంటసీ, మంచి లవ్ స్టొరీ వుంది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఫిబ్రవరి 16న తప్పకుండ అందరూ థియేటర్స్‌లో చూడాలి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ‘‘విడుదలైన రెండు పాటలని గొప్పగా హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజమేనే, హమ్మ హమ్మ పాటలని ప్రేక్షకులు వోన్ చేసుకొని రీల్స్ చేస్తూ గొప్ప ఆదరణ చూపించారు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చింది. ఊరు పేరు భైరవకోన లో ఎమోషన్ హారర్ థ్రిల్ పీక్స్ లో వుంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది’’ అని అన్నారు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర.


ఇవి కూడా చదవండి:

====================

*Harish Shankar: ‘ఈగల్’లో లవ్ స్టోరీ లేదు.. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ లేదు

*************************

*Nikhil: అప్పుడే నిఖిల్‌కు డైపర్ క్లాస్‌లు మొదలయ్యాయ్..

***************************

*Devara: మరో హీరోయిన్ ఈ మరాఠీ బ్యూటీనా.. ఫొటోలు వైరల్

******************************

*Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..

******************************

Updated Date - Feb 11 , 2024 | 09:28 PM