మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prathinidhi 2: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ విడుదల వాయిదా..

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:34 PM

నారా రోహిత్ హీరో‌గా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం ‘ప్రతినిధి 2’. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో.. మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్‌కు సంబంధించి న్యూ డేట్‌ని మేకర్స్ ప్రకటిస్తామని తెలిపారు.

Nara Rohit in Prathinidhi 2

నారా రోహిత్ (Nara Rohit) హీరో‌గా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు (Murthy Devagupthapu) దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది (Prathinidhi 2 Postponed). ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో.. మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్‌కు సంబంధించి న్యూ డేట్‌ని మేకర్స్ ప్రకటిస్తామని తెలిపారు.

*Kavya Kalyanram: 'బలగం' భామ భలే వుంది, మీరూ చూసెయ్యండి !


వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vanara Entertainments) మరియు రానా ఆర్ట్స్ (Rana Arts) పతాకాలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, మరియు సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రమోషన్స్ కూడా యమా జోరుగా నడుస్తోన్న సమయంలో.. సడెన్‌గా మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.


ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. హీరో, దర్శకుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకం కాదని, వ్యవస్థలో ఉన్న లోపాన్ని ప్రశ్నించి.. దానికి సరైన జవాబు చూపించేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ‘ప్రతినిధి 2’ అనేది ‘ప్రతినిధి’ సిరీస్ నుండి వస్తోన్న రెండవ ఫ్రాంచైజీ చిత్రం. ఇందులో నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ నటించాడు. సిరీ లెల్లా (Siree Lella) కథానాయికగా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Updated Date - Apr 23 , 2024 | 08:34 PM