Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’.. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:36 PM

మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించి, కలెక్షన్ల సునామీ సృష్టించి, మరోసారి మెగాస్టార్ సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చాటింది. ఈ సినిమా సంవత్సరం పాటు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్‌లో ప్రదర్శించబడుతోన్న విషయంపై మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు.

Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’.. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), శృతిహాసన్ (Shruti Haasan) హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ బాబీ (Bobby) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). 2023 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించి, కలెక్షన్ల సునామీ సృష్టించి, మరోసారి మెగాస్టార్ సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చాటింది. అయితే ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తయినా.. ఇంకా ఒక థియేటర్‌లో ఆడుతూ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం థియేటర్లలో సినిమా స్పాన్ కేవలం నాలుగు వారాలు మాత్రమే. అలాంటిది ఒక సంవత్సరం పాటు థియేటర్లలో సినిమా సందడి చేస్తూనే ఉందంటే.. అది మెగాస్టార్ స్టామినా అనే చెప్పుకోవాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా మెగాస్టార్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో.. (#365DaysOfWaltairVeerayya)


chiru.jpg

‘‘అభిమానులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2023 సంక్రాంతి నుండి 2024 సంక్రాంతి వరకు.. ఒక సంవత్సరం పాటు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్‌ (Rama Krishna Theater in Avanigadda)లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఆడుతూనే ఉందంటే, మీకు నాపై ఉన్న ప్రేమ, అభిమానం ఎలాంటివో తెలుస్తున్నాయి. మీ లవ్ అండ్ ఎఫెక్షన్‌కు థ్యాంక్యూ. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్. ఈ రికార్డ్‌కి కారణం మీకు నచ్చేలా, మీరు మెచ్చేలా.. ఈ చిత్రాన్ని మలిచిన డైరెక్టర్ బాబీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP), నా తమ్ముడు రవితేజ (Ravi Teja)తో పాటు.. ఈ చిత్రంలో ఉన్న ఇతర తారాగణం. వీళ్లందరినీ దండలా ఏర్చి కూర్చి పేర్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అందరి సమిష్టి కృషి ‘వాల్తేరు వీరయ్య’. ఇలాంటి మరిన్ని చిత్రాలను మీకు అందించేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. లవ్ యు ఆల్. మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు..’’ అని మెగాస్టార్ చిరంజీవి ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Janhvi Kapoor: ప్రేమలో పడిపోయా.. నాని ‘హాయ్ నాన్న’పై జాన్వీకపూర్

************************

*నన్ను క్షమించు స్వామీ... కెప్టెన్‌ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం

***************************

*Guntur Kaaram: ‘మావ ఎంతైనా’.. లిరికల్ సాంగ్

***************************

*Vijay Sethupathi: హిందీ నేర్చుకోవద్దని ఎవరూ చెప్పలేదు

*******************************

*Dil Raju: మహేష్ బాబు కలెక్షన్ల తాట తీయబోతున్నాడు..

****************************

Updated Date - Jan 10 , 2024 | 03:36 PM