Dil Raju: మహేష్ బాబు కలెక్షన్ల తాట తీయబోతున్నాడు..

ABN , Publish Date - Jan 10 , 2024 | 09:50 AM

మహేష్ బాబు‌ ‘గుంటూరు కారం’ సినిమాతో కలెక్షన్ల తాట తీయబోతున్నాడని అన్నారు సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి స్పెషల్‌గా విడుదల కాబోతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించారు.

Dil Raju: మహేష్ బాబు కలెక్షన్ల తాట తీయబోతున్నాడు..
Dil Raju

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ‘అతడు, ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. (Guntur Kaaram Pre Release Event)

ఈ కార్యక్రమంలో సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ‘‘గుంటూరు వైబ్స్ మామూలుగా లేవు. అప్పుడే సంక్రాంతికి సినిమా విడుదలైన వైబ్స్ కనిపిస్తున్నాయి. ముందుగా మా మిత్రుడు, నిర్మాత చినబాబు గారికి థాంక్యూ వెరీ మచ్. చినబాబు గారు ప్రతి సినిమాని ఎంతో శ్రద్ధగా తీస్తూ, విజయాలు సాధిస్తున్నారు. అలాగే చినబాబుగారికి వంశీ తోడుగా ఉంటూ.. హారిక అండ్ హాసిని, సితార బ్యానర్లపై మంచి సినిమాలు అందిస్తున్నారు. నిర్మాతలుగా రాణించడం అంత తేలిక లేదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ వారిద్దరి ప్రయాణం అద్భుతంగా ఉంది. వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌గారు. ఆ బ్యానర్ల నుంచి వచ్చే సినిమాల విజయం వెనుక ఆయన కూడా ఉన్నారు. ఎన్నో మంచి సినిమాలు అందిస్తున్న మీ అందరికీ కృతఙ్ఞతలు. థమన్ సంగీతంతో అదరగొడుతున్నాడు. ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు మహేష్ గారు, శ్రీలీల వేసే డ్యాన్స్‌లకు థియేటర్లలో స్క్రీన్‌లు చిరిగిపోతాయి. త్రివిక్రమ్‌గారు నాకు కొన్ని సన్నివేశాలు చూపించారు. పాటలు మాత్రమే కాదు.. నేపథ్య సంగీతం కూడా థమన్ మామూలుగా ఇవ్వలేదు. థియేటర్లకు వెళ్ళేటప్పుడు పేపర్లు ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఆ సన్నివేశాలకు పేపర్లు సరిపోవు. శ్రీలీల ఎనర్జీ గురించి మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూశాను. మామూలుగా లేదు.


GK.jpg

త్రివిక్రమ్‌గారు ప్రతి సినిమాతో ఏదో మాయ చేస్తారు. మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి, హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. త్రివిక్రమ్‌గారు అద్భుతమైన సినిమా తీస్తున్నారు. మహేష్ బాబు‌గారు ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు. త్రివిక్రమ్‌గారు హీరో క్యారెక్టర్‌ని రాసిన విధానం బాగుంది. ‘పోకిరి, దూకుడు’ వంటి సినిమాల తరహాలో మహేష్‌గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి త్రివిక్రమ్‌గారు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. సిద్ధంగా ఉండండి. ఈ సంక్రాంతి మహేష్‌గారి అభిమానులకు చాలా పెద్ద పండగ. ఈ మధ్య ప్రతి సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ ఇరగదీస్తున్నారు మహేష్ గారు. అది మీకోసమే. ఈ సినిమాలో కుర్చీ పాట మిమ్మల్ని బాగా అలరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను ఈ గుంటూరు కారం కట్టిపడేస్తుంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వస్తుంది. రెడీగా ఉండండి’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ashika Ranganath: ‘నా సామిరంగ’లో నేను రెబల్..

**************************

*Katrina Kaif: చెన్నై నా సెకండ్‌ హోం టౌన్‌

***************************

Updated Date - Jan 10 , 2024 | 09:50 AM