Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

ABN , Publish Date - Feb 06 , 2024 | 05:40 PM

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న కావ్య థాఫర్.. తన తాజా ఇంటర్వ్యూలో సినిమా పేరును లీక్ చేసింది. మేకర్స్ ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించలేదు. తాజాగా ఆమె ‘ఈగల్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలిపారు.

Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ
Heroine Kavya Thapar

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న కావ్య థాఫర్.. తన తాజా ఇంటర్వ్యూలో సినిమా పేరును లీక్ చేసింది. మేకర్స్ ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించలేదు. తాజాగా ఆమె ‘ఈగల్’ (Eagle) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘విశ్వం’ (Vishwam) చిత్రంలో తను నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఎలా అయితే మాటల్లో సినిమా సీక్రెట్స్‌ని లీక్ చేస్తుంటారో.. అలా కావ్య కూడా లీక్ చేసిందంటూ ఆమెపై వార్తలు వైరల్ అవుతున్నాయి.

Gopichand.jpg

ఇదే కార్యక్రమంలో ‘ఈగల్’ సినిమా గురించి కావ్య థాపర్ (Kavya Thapar) మాట్లాడుతూ.. ‘‘ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వున్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే మాస్ మహారాజా రవితేజ సినిమాలో చేయడం గొప్ప అవకాశం. ఇందులో యాక్షన్, రొమాన్స్ చాలా యూనిక్‌గా వుంటాయి. రొమాన్స్ అయితే చాలా డిఫరెంట్‌గా, కొత్తగా వుంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ వున్న అమ్మాయిగా కనిపిస్తాను. రవితేజ, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ యూనిక్‌గా వుంటుంది. మాస్ మహారాజా వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో వుంటారు. సెట్స్‌లో చాలా సరదాగా, సపోర్టివ్‌గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. (Kavya Thapar About Eagle Movie)


Kavya.jpg

ఇందులో నా నటన గురించి రచయిత మణి మాట్లాడుతూ.. ‘అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కాకుండా రచన కనిపించింది’ అన్నారు. రచయిత నుండి ఈ ప్రశంస రావడం చాలా తృప్తిని ఇచ్చింది. నా వరకూ పాత్రకు వందశాతం న్యాయం చేశాననే నమ్ముతున్నాను. ఈగల్ బ్యూటీఫుల్ జర్నీ. నిజంగా ఒక వెకేషన్‌లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను..’’ అని తెలిపారు. కాగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.


ఇవి కూడా చదవండి:

====================

*Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

*****************************

*Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

*****************************

*Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు

***************************

*హీరో విశాల్‌ - లైకా ప్రొడక్షన్ ఖాతాల ఆడిట్‌: హైకోర్టు ఆదేశం

*************************

Updated Date - Feb 06 , 2024 | 05:40 PM