Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:59 PM

కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్రనటులైన ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌, ‘దళపతి’ విజయ్‌ అభిమానుల మధ్య గత కొన్నేళ్లుగా ‘సూపర్‌స్టార్‌’ ఎవరన్న దానిపై చర్చ సాగుతూ వచ్చింది. కోలీవుడ్‌ ‘సూపర్‌స్టార్‌ తలైవర్‌’ అని రజనీకాంత్‌ ఫ్యాన్స్ అంటే.. కాదు ఇపుడు ‘తమిళ సూపర్‌స్టార్‌ దళపతి’ అంటూ విజయ్‌ ఫ్యాన్స్ వీరావేశంతో నినాదాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టడంతో.. ఆ చర్చ దాదాపు ముగిసినట్లే అనేలా టాక్ వినబడుతోంది.

Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ
Vijay and Rajinikanth

తమిళ చిత్రపరిశ్రమ (Kollywood)కు చెందిన ఇద్దరు అగ్రనటులైన ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ (Rajinikanth), ‘దళపతి’ విజయ్‌ (Vijay) అభిమానుల మధ్య గత కొన్నేళ్లుగా ‘సూపర్‌స్టార్‌’ (Super Star) ఎవరన్న దానిపై చర్చ సాగుతూ వచ్చింది. కోలీవుడ్‌ ‘సూపర్‌స్టార్‌ తలైవర్‌’ అని రజనీకాంత్‌ అభిమానులు అంటే.. కాదు ఇపుడు ‘తమిళ సూపర్‌స్టార్‌ దళపతి’ అంటూ విజయ్‌ అభిమానులు వీరావేశంతో నినాదాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘జైలర్‌’ (Jailer) చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకలో రజనీకాంత్‌ చెప్పిన ‘కాకి-గద్ద’ కథ ఆ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అయితే, ‘లాల్‌సలాం’ (Lal Salaam) చిత్ర ఆడియో రిలీజ్‌ వేడుకలో రజనీకాంతే స్వయంగా ఆ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు.

ఇపుడు విజయ్‌ తన రాజకీయ ప్రయాణంలో తొలి అడుగు వేశారు. దీంతో విజయ్‌ అభిమానులు ఇకపై రజనీకాంత్‌, అజిత్‌ కుమార్ (Ajith Kumar) అభిమానులతో గొడవలకు, వాగ్వాదానికి దిగే అవకాశం ఉండదు. ‘గోట్‌’ (GOAT), ‘విజయ్‌ 69’ చిత్రాలను పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితంకానున్నట్టు విజయ్‌ ప్రకటించారు. దీంతో ఈ రెండు చిత్రాల తర్వాత ‘సూపర్‌స్టార్‌’, ‘అత్యధిక వసూళ్లు’ అనే మాటల చర్చకు శుభంకార్డు పడినట్టే. పైగా విజయ్‌ ‘తమిళ వెట్రి కళగం’ (Tamizhaga Vetri Kazhagam) పేరుతో పార్టీని ప్రకటించగానే ఆయన అభిమానులు సూపర్‌స్టార్‌ రచ్చను పక్కనబెట్టి.. ‘2026లో ముఖ్యమంత్రి విజయ్‌’ అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు.


Ajith-Kumar.jpg

ఇక ఈ నేపధ్యంలో విజయ్ అభిమానులు మరోసారి సూపర్‌స్టార్ అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేసే అవకాశం లేదు. ఎందుకంటే, విజయ్‌కు ఇప్పుడు రజనీకాంత్ అభిమానుల అండదండలు కూడా కావాలి. రజనీకాంత్ కూడా పొలిటికల్ పార్టీ పెట్టాలని నిర్ణయించుకుని చివరి నిమిషంలో విరమించుకున్నారు. ఇప్పుడు విజయ్ పొలిటికల్‌ రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి.. ఆయనకు అందరి హీరోల అభిమానుల సపోర్ట్ కావాలి. మరీ ముఖ్యంగా విజయ్ అభిమానులు ఎప్పుడూ గొడవకు దిగే రజనీకాంత్, అజిత్ వంటి స్టార్ హీరోల అభిమానులతో గొడవకు దిగకుండా.. వారిని కూడా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తేనే బెటర్ అని కోలీవుడ్ విమర్శకులు విజయ్ అభిమానులకు హితబోధ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు

***************************

*హీరో విశాల్‌ - లైకా ప్రొడక్షన్ ఖాతాల ఆడిట్‌: హైకోర్టు ఆదేశం

*************************

*Guntur Kaaram: అఫీషియల్‌‌గా ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. విశేషమేమిటంటే?

************************

*Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..

*************************

Updated Date - Feb 06 , 2024 | 03:16 PM