Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు

ABN , Publish Date - Feb 04 , 2024 | 04:31 PM

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T. Greatest Of All Time అనేది ట్యాగ్‌లైన్. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. తాజాగా ఈ చిత్రం నుండి ‘అయ్యో పాపం సారూ..’ అనే ఓ బ్యూటిఫుల్ లిరిక‌ల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు
GOAT Movie Still

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (Greatest Of All Time). దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి (Naresh Kuppili) దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘అయ్యో పాపం సారూ..’ అనే ఓ బ్యూటిఫుల్ లిరిక‌ల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అంతేకాదు, ఒక స్టార్ హీరో సినిమా పాట లిరిక్ ఎలా అయితే ట్రెండ్ అవుతుందో.. సుధీర్ నటించిన ఈ GOATలోని ‘అయ్యో పాపం సారూ’ (Ayyo Paapam Saaru) అనే హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో డ్రెండ్ అవుతుండటం విశేషం. సురేష్ బ‌నిశెట్టి సాహిత్యం స‌మ‌కూర్చిన ఈ పాట‌కు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. హీరో సుధీర్‌, హీరోయిన్ దివ్య‌భార‌తిల‌పై చిత్రీక‌రించిన ఈ పాట విన‌సొంపైన బాణీల‌తో, క్యాచీ ప‌దాల‌తో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటోంది.


Sudheer-Babu.jpg

ఈ పాట విడుదల సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. హీరో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఏపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నాం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*హీరో విశాల్‌ - లైకా ప్రొడక్షన్ ఖాతాల ఆడిట్‌: హైకోర్టు ఆదేశం

*************************

*Guntur Kaaram: అఫీషియల్‌‌గా ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. విశేషమేమిటంటే?

************************

*Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..

*************************

Updated Date - Feb 04 , 2024 | 04:33 PM