I 20: ‘ఐ 20’ రిలీజ్‌కు రెడీ.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:37 PM

సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘ఐ - 20’. బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి. మహేంద్ర నిర్మించారు. ఇది మంచి సందేశంతో తెరకెక్కిన ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

I 20: ‘ఐ 20’ రిలీజ్‌కు రెడీ.. ఎప్పుడంటే?
I 20 Movie Still

సూర్యరాజ్ (Surya Raj), మెరీనా సింగ్ (Merina Singh) జంటగా నటించిన చిత్రం ‘ఐ - 20’ (I 20). బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి. మహేంద్ర నిర్మించారు. ఇది మంచి సందేశంతో తెరకెక్కిన ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం. ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (I 20 Release Date Changed)

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?


I-20-Movie.jpg

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో స్త్రీలను ప్రత్యేకంగా గౌరవిస్తాం. వాళ్ళ గౌరవం గురించే ఈ చిత్రాన్ని నిర్మించాం. కథ చాలా బాగా వచ్చింది. మంచి రొమాన్స్ ఉంది, కామెడీ అయితే అద్భుతంగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. అయితే మొదట ఈ సినిమాని జూన్ 7న విడుదల చేద్దాం అనుకున్నాం కానీ.. ఆ రోజున చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అందుకే మా సినిమాను జూన్ 14 విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో మా సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి సినిమా పక్కాగా విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అని అన్నారు. (I 20 Movie Ready to Release)

Read Latest Cinema News

Updated Date - Jun 06 , 2024 | 05:37 PM